Delhi Ordinance Bill: లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్ పాస్
ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు పాస్ అయింది. హైడ్రామా నడుమ ఈ రోజు పార్లమెంటులో అధికార పార్టీ బీజేపీ ఢిల్లీ సర్వీస్ బిల్లును ఆమోదించింది.
- By Praveen Aluthuru Published Date - 08:36 PM, Thu - 3 August 23
Delhi Ordinance Bill: ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు పాస్ అయింది. హైడ్రామా నడుమ ఈ రోజు పార్లమెంటులో అధికార పార్టీ బీజేపీ ఢిల్లీ సర్వీస్ బిల్లును ఆమోదించింది. గతంలో ఉన్న బిల్లకు కొన్ని మార్పులు చేసి తాజా బిల్లును ప్రవేశపెట్టారు. అంతకుముందు ప్రతిపక్షాలు వాకౌట్ చేయడంతో బిల్లును వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించారు. ఈ బిల్లును ఢిల్లీ గవర్నమెంట్ ఆప్ తీవ్రంగా వ్యతిరేకించింది. సీఎం కేజ్రీవాల్ కు విపక్షాల మద్దతు లభించింది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ సహా అన్ని పార్టీ మద్దతు లభించింది. అయినప్పటికీ ప్రయోజనం లేదు.
బిల్లుపై చర్చించే క్రమంలో పార్లమెంట్ అట్టుడికిపోయింది. విపక్షాలు పార్లమెంట్ సభాపతి వద్దకు వచ్చి నిరసనలు చేపట్టారు. పేపర్లు చించేసి విసిరారు. ఈ క్రమంలో AAP ఎంపీ సుశీల్ కుమార్ రింకూను స్పీకర్ ఓం బిర్లా వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు. ఢిల్లీపై నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉన్నందున బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీకి నిబంధనలను రూపొందించే హక్కు కేంద్రానికి ఉందని ఆయన అన్నారు. ఈ క్రమంలోఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని హోంమంత్రి విమర్శించారు.
Also Read: Home Cleaning: దీపం పెట్టిన తర్వాత ఇంటిని శుభ్రం చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?