HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Delhi High Court Shock To Arvind Kejriwal

Delhi Liquor Case : సీఎం కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్

హోలీ పండుగ కారణంగా సోమ, మంగళవారాల్లో కోర్టుకు సెలవు ఉన్నందున మార్చి 27వ తేదీ బుధవారమే కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు

  • Author : Sudheer Date : 23-03-2024 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arvind Kejriwal Claims Cop Who Manhandled AAP Leader Misbehaved With Him
Arvind Kejriwal Claims Cop Who Manhandled AAP Leader Misbehaved With Him

సీఎం కేజ్రీవాల్‌ (CM Kejriwal)కు మరో బిగ్ షాక్ తగిలింది. అరెస్ట్, ఈడీ కస్టడీపై ఆదివారం లోపు అత్యవసర విచారణ జరపాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయస్థానం తిరస్కరించింది. హోలీ పండుగ కారణంగా సోమ, మంగళవారాల్లో కోర్టుకు సెలవు ఉన్నందున మార్చి 27వ తేదీ బుధవారమే కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో మరోసారి కేజ్రీవాల్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో తన అరెస్ట్ అక్రమంటూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) మెట్లు ఎక్కారు. ఈడీ అరెస్ట్, కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులను కొట్టేసి.. తనను వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. అయితే, సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. విచారణ కోసం బుధవారం ఆగాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో తన అరెస్ట్, కస్టడీని కొట్టేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఢిల్లీ కోర్ట్ షాక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటె కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలని అందులో పేర్కొంది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. జర్మనీ చర్య తమ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం జర్మనీ ప్రకటనను సమర్థించింది.

Read Also : CM Revanth Reddy: కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ నేతలు చేరుతుండడం ఫై VH అసంతృప్తి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arvind kejriwal
  • delhi high court
  • Delhi liquor case

Related News

Delhi High Court deals a blow to Kavitha.

kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుపై ప్రజా అభ్యంతరాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం దాని రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే. 15 రోజుల్లోనే మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, లేదంటే దరఖాస్తును రద్దు చేస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే దీనిపై న్యాయ పోరాటానికి దిగారు కవిత. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా.. ఈ వ్యవహారంలో తాము

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd