Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్
సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ పై వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్..
- Author : Latha Suma
Date : 29-07-2024 - 5:52 IST
Published By : Hashtagu Telugu Desk
Kejriwal:అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో బెయిల్ పిటిషన్(Bail Petition)పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ (Reserve)చేసింది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై మొదట విచారణ ట్రయల్ కోర్టులో జరగాలని సీబీఐ తెలిపింది. కేజ్రీవాల్ సహా ఆరుగురిపై చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు హైకోర్టుకు సీబీఐ తెలిపింది. కేసు దర్యాప్తును కేజ్రీవాల్ ప్రభావితం చేస్తున్నారని.. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అనేక ఆధారాలు వెలుగులోకి వచ్చాయని సమగ్ర దర్యాప్తు జరిపి చార్జ్‌షీట్ దాఖలు చేసిసట్లు న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇకపోతే.. లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని.. రికవరీ కూడా లేదని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. లిక్కర్ పాలసీ ఆమోదంపై కేజ్రీవాల్‌తో పాటు ఢిల్లీ ఎల్జీ సహా 15 మంది సంతకం చేశారరని.. వారిని ఎందుకు నిందితులుగా సీబీఐ చేర్చలేదని సింఘ్వి ప్రశ్నించారు. సీబీఐ కేసులో కేజ్రీవాల్ సూత్రధారి అంటున్నారని.. కానీ ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవన్నారు. విజయ్ నాయర్‌కి సీబీఐ కేసులో బెయిల్ వచ్చిందని.. కేజ్రీవాల్‌కు కూడా బెయిల్ ఇవ్వాలని అభిషేక్ సింఘ్వి కోర్టును కోరారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయను తీహార్ జైలుకు తరలించారు. ఆ మధ్య ట్రయల్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ వచ్చింది. దీనిపై ఈడీ హైకోర్టుకు వెళ్లడంతో స్టే విధించింది. దీంతో బెయిల్ వచ్చినట్లే వచ్చి.. బ్రేక్ పడింది.
Read Also: Manu Bhaker : మను భాకర్ మెడ వెనుక పచ్చబొట్టు రహస్యం మీకు తెలుసా..?