HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Delhi Dy Cm Presents Rs 75800 Cr Rozgar Budget For 2022 23

Delhi Budget: రోల్ మోడ‌ల్ గా ‘ఢిల్లీ’ వార్షిక బ‌డ్జెట్

చేప‌లు ప‌ట్టివ్వ‌డం కాదు..ప‌ట్టుకోవ‌డం నేర్పించాల‌ని చైనా ర‌చ‌యిత ఎప్పుడో చెప్పిన మాట‌.

  • Author : CS Rao Date : 26-03-2022 - 4:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi
Delhi

చేప‌లు ప‌ట్టివ్వ‌డం కాదు..ప‌ట్టుకోవ‌డం నేర్పించాల‌ని చైనా ర‌చ‌యిత ఎప్పుడో చెప్పిన మాట‌. దాన్ని అక్ష‌రాల ఢిల్లీ ప్ర‌భుత్వం పాటిస్తోంది. ఆప్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ ను చూస్తే ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌రిచేలా రూప‌క‌ల్ప‌న చేసినట్టు స్ప‌ష్టం అవుతోంది. ప్ర‌స్తుతం ఢిల్లీ మొత్తం జనాభాలో 57 లక్షల మంది పౌరులు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని 75 లక్షలకు పెంచాలని కేజ్రీ స‌ర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. వీధి వ్యాపారాల‌ను ప్రోత్స‌హించాల‌ని బ‌డ్జెట్ కేటాయింపు చేయడం అక్క‌డి జ‌న‌రంజ‌క బడ్జెట్ గుర్తు చేస్తోంది.
ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం ఉపాధి రంగంపై దృష్టి సారించిన 8వ వార్షిక బ‌డ్జెట్ ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టాడు. ‘రోజ్‌గార్ బడ్జెట్ `గా పిలుస్తున్న ఈ బ‌డ్జెట్ కోవిడ్ -1 సమయంలో జీవనోపాధిని కోల్పోయిన వారికి ఉద్యోగాలు, ఆహారం , వ్యాపార అవకాశాలను పెంచే పథకాలతో ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

కోవిడ్ 19 కార‌ణంగా ప్రస్తుతం ఉన్న‌ మార్కెట్ ధరల ప్రకారం ఢిల్లీ GSDP 2020-21లో రూ. 7,85,342 కోట్ల నుండి రూ.9,23,967కి పెరిగే అవకాశం ఉంది. 2021-22లో 23,967 కోట్లు అంటే 17.65 శాతం పెరుగుదల” అని సిసోడియా వెల్ల‌డించాడు. ఢిల్లీ ప్ర‌భుత్వం 2022-23 సంవత్సరానికి రూ. 75,800 కోట్ల బడ్జెట్ అంచనాను ప్రతిపాదించింది. 2021-22 సంవత్సరానికి రూ. 69,000 కోట్ల బడ్జెట్ అంచనా కంటే 9.86 శాతం ఎక్కువ. అంతేకాదు, సవరించిన అంచనాల కంటే 13.13 శాతం ఎక్కువ. ఆరోగ్య రంగానికి రూ.9,668 కోట్ల బడ్జెట్‌ను సిసోడియా ప్రకటించాడు. హెల్త్ కార్డ్ చొరవ కోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్ల‌డించాడు. ఢిల్లీ వాసులకు హెల్త్‌కార్డుల కోసం ప్రభుత్వం రూ.160 కోట్లు మంజూరు చేసింది. ఢిల్లీ ప్రజలకు యోగా శిక్షణ అందించే యోగా టీచర్ల కోసం రూ.15 కోట్లు కేటాయిస్తూ బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న చేయ‌డం గ‌మ‌నార్హం.
ఢిల్లీ స‌ర్కార్ ఉద్యోగాలను సృష్టించడం, ఉపాథి క‌ల్పించ‌డం కోసం రూ. 800 కోట్లు కేటాయించింది. అంతేకాదు, ఆ మొత్తాన్ని ఆడిట్ ప‌రిధిలోకి తీసుకొస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మొహల్లా క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, మహిళా మొహల్లా క్లినిక్‌ల నిర్మాణం, అభివృద్ధికి రూ.475 కోట్లు కేటాయించింది. అదనంగా, నాలుగు కొత్త ఆసుపత్రులను నిర్మించడానికి నగరంలో ఉన్న ఆసుపత్రులను తిరిగి అభివృద్ధి చేయడానికి మరియు అప్‌గ్రేడ్ చేయడానికి రూ. 1,900 కోట్లు కేటాయించింది.

ప్రముఖ మార్కెట్‌ప్లేస్‌లను తిరిగి అభివృద్ధి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. “ఢిల్లీ ప్రభుత్వం 6 నుండి 8 వారాల పాటు రిటైల్ , హోల్‌సేల్ షాపింగ్ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తుంది. అందుకోసం నగరంలోని అనేక ప్రముఖ మార్కెట్‌లను తిరిగి అభివృద్ధి చేయ‌డానికి రూ. 100 కోట్లు కేటాయించింది. సుమారు ఐదు మార్కెట్‌లను తొలి ద‌శ‌లో అభివృద్ధి చేస్తారమ‌ని సిసోడియా అన్నారు. ఢిల్లీలోని స్ట్రీట్ ఫుడ్‌ను పెంచేందుకు డిప్యూటీ సీఎం చర్యలు కూడా ప్రకటించారు. దీని కోసం, ప్రభుత్వం “ఢిల్లీ ఫుడ్ ట్రక్ పాలసీ”ని ప్రారంభిస్తుంది. దీని కింద ఆహార-ట్రక్కులు రాత్రి 8 గంటల నుండి పనిచేస్తాయి. 2 గంటల వరకు ప్రభుత్వం రిటైల్ రంగం, ఆహార పానీయాలు, లాజిస్టిక్స్, టూరిజం, వినోదం, నిర్మాణం, రియల్ ఎస్టేట్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాలను ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతగా ఎంచుకుంది. గాంధీ నగర్‌లోని మార్కెట్‌ను రెడీమేడ్ గార్మెంట్స్ టెక్స్‌టైల్ రంగంలో ‘గ్రాండ్ గార్మెంట్ హబ్’గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో 40,000 కంటే ఎక్కువ కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించగలదని భావిస్తున్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌ను సమర్పిస్తూ..రాబోయే 5 సంవత్సరాలలో ఢిల్లీలో ఉపాధి రేటును 33 శాతం నుండి 45 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేర‌కు సిసోడియా వెల్ల‌డించ‌డం యావ‌త్తు భార‌త‌దేశాన్ని ఆక‌ట్టుకుంటోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arvind kejriwal
  • delhi
  • india
  • state budjet

Related News

Trump's 10% Global Tariffs

Trump’s 10% Global Tariffs : 10% గ్లోబల్ టారిఫ్ లాభమా? నష్టమా?

ఈ నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, చివరికి ఆ భారం అక్కడి సామాన్య వినియోగదారులపైనే పడుతుంది

  • Delhi Alert

    Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!

  • US Tariffs

    Trump Tariffs : అంతలేదు.. ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది – ట్రంప్ స్పష్టం

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Bill Gates 

    ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

Latest News

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

  • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd