RBI Quiz : స్టూడెంట్స్‌కు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు.. రూ.10 లక్షల దాకా ప్రైజ్‌మనీ
ఇందులో భాగంగా అన్ని రకాల కోర్సులు చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా క్విజ్ పోటీలను ఆర్‌బీఐ నిర్వహిస్తుంది.
- By Pasha Published Date - 12:29 PM, Thu - 5 September 24
RBI Quiz : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI Quiz) ఏర్పాటై 90 ఏళ్లు గడిచిపోయాయి. 90 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఆర్‌బీఐ దేశవ్యాప్తంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని యోచిస్తోంది. ఈక్రమంలోనే యువతతోనూ మమేకం కావాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని రకాల కోర్సులు చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా క్విజ్ పోటీలను ఆర్‌బీఐ నిర్వహిస్తుంది. ఈ సమాచారాన్ని అన్ని డిగ్రీ కాలేజీలకు చేరవేయాలని ఇటీవలే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)ను ఆర్‌బీఐ కోరింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాలేజీల్లో డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ క్విజ్ పోటీలకు అప్లై చేయొచ్చు. ఈ పోటీల్లో ఆర్‌బీఐ చరిత్ర, కార్యకలాపాలు, పనితీరుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను కూడా అడుగుతారు. ఈ అంశంతో పాటు హిస్టరీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు కూడా క్విజ్‌లో ఉంటాయి.ఈ క్విజ్ పోటీలు ఈనెలలోనే ప్రారంభం అవుతాయి. రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి క్విజ్ పోటీలు అక్టోబర్, నవంబర్ నెలల్లో జరుగుతాయి. ఫైనల్స్ పోటీలు డిసెంబరులో జరుగుతాయి. ఆసక్తిగల విద్యార్థులు సమాచారం కోసం RBI అధికారిక వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
We’re now on WhatsApp. Click to Join
తొలి దశ క్విజ్ – ఆన్‌లైన్‌లో
తొలిదశ క్విజ్ పోటీలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. వీటిని హిందీ, ఇంగ్లిష్ మీడియంలలో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ క్విజ్ పోటీలో రాష్ట్రాలవారీగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కాలేజీలను తదుపరి రౌండ్ క్విజ్ పోటీల కోసం ఎంపిక చేస్తారు.
రెండోదశ పోటీలు – రాష్ట్రస్థాయిలో
వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన కాలేజీలు రెండోదశ క్విజ్ పోటీలలో పాల్గొంటాయి. వీటిని ప్రత్యేకమైన వేదికలపై నేరుగా నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల క్విజ్ టీమ్‌లు ఈ పోటీలలో తలపడతాయి. ఈ రౌండ్‌లో ఎంపికయ్యే టీమ్‌లను తదుపరిగా జోనల్ స్థాయి క్విజ్ పోటీలకు ఎంపిక చేస్తారు.
Also Read :Trifoldable Phone: ప్రపంచంలోనే తొలి ట్రై ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే రిలీజ్
జోనల్స్ పోటీలు, నేషనల్స్ పోటీలు
రెండో దశ క్విజ్ పోటీలలో ఎంపికయ్యే టీమ్‌లకు తొలుత జోనల్ స్థాయి పోటీలను నిర్వహిస్తారు. వీటిలోనూ ఎంపికయ్యే టీమ్‌లను చివరగా నేషనల్స్ పోటీలకు ఎంపిక చేస్తారు. అక్కడ టీమ్‌లు పోటీ పడుతాయి. వాటిలో చివరగా ఎంపికయ్యే టీమ్స్‌కు జాతీయ స్థాయి ఫైనల్ పోటీలను నిర్వహిస్తారు.
బహుమతుల వివరాలివీ..
ఈ క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచే వారికి బ్రహ్మాండమైన గిఫ్టులను ఆర్‌బీఐ అందించనుంది. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా ఎంపికైన ప్రతీ టీమ్‌కు బహుమతులను అందిస్తారు. జాతీయ స్థాయిలో మొదటి బహుమతిని సాధించిన టీమ్‌కు రూ. 10 లక్షలు అందిస్తారు. రెండో స్థానంలో నిలిచిన టీమ్‌కు రూ. 8 లక్షలు అందిస్తారు. మూడో స్థానంలో నిలిచిన టీమ్‌కు రూ. 6 లక్షలు అందిస్తారు. దీనితో పాటు ఈ పోటీల్లో పాల్గొనే వారందరికీ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.
Related News
ULI : ‘యూఎల్ఐ’ వస్తోంది.. లోన్ల ప్రాసెసింగ్ ఇక మరింత స్పీడ్
లెండింగ్ అంటే లోన్లకు సంబంధించిన వ్యవహారం. యూపీఐ విధానంలో కేంద్ర బిందువు ‘పేమెంట్స్’..