HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Deadline To Update Aadhaar Card For Free Extended Till 14 June

Aadhaar: మరోసారి ఆధార్‌ అప్‌డేట్‌ గడువు పొడిగింపు

  • By Latha Suma Published Date - 03:45 PM, Tue - 12 March 24
  • daily-hunt
Aadhaar Update
Aadhaar Update

 

Aadhaar Update: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్‌ (Aadhaar) వివరాలు అప్‌డేట్‌ చేసకునేందుకు కల్పించిన గడువును మరోసారి పొడిగించింది. ప్రస్తుత గడువు మార్చి 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో జూన్‌ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు. ఇప్పటికే రెండుసార్లు గడువును పెంచిన విషయం తెలిసిందే.

#UIDAI extends free online document upload facility till 14th June 2024; to benefit millions of Aadhaar holders.
This free service is available only on the #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar pic.twitter.com/eaSvSWLvvt

— Aadhaar (@UIDAI) March 12, 2024

తొలుత 2023 మార్చి15గా ఉన్న గడువును డిసెంబర్‌ 14 వరకు పొడిగించింది. తర్వాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆధార్‌ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్‌ వివరాలు అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి లేటెస్ట్‌ గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సబ్మిట్‌ చేయాలి. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని తెలిపింది. విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించ్చుకోవచ్చని ఉడాయ్‌ పేర్కొంది. ఉచిత సేవలు ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఆధార్‌ ప్రారంభించిన తొలినాళ్లలో తీసుకున్న వారి కార్డుల వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఫొటోలు, చిరునామాల మార్పు, తప్పొప్పులతో తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో, వారు అనేక ఇక్కట్లకు గురికావాల్సి వస్తున్నది. దీనిపై విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు కూడా పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆధార్‌ కార్డుల సవరణతోపాటు అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. 2014 కంటే ముందు ఆధార్‌ పొందిన వారు తమ వివరాలను అప్డేట్‌ చేసుకోవాలని సూచిస్తూ, ఉత్తర్వులు విడుదల చేసింది. కార్డు నవీకరణ చేసుకునేందుకు జూన్‌14 వరకు గడువు కూడా విధించింది. చిన్నారులకు కార్డు తీసుకుని ఐదేండ్లు దాటితే వేలిముద్రలు, ఫొటోలను కూడా అప్డేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. పదేళ్ల కింద ఆధార్‌ కార్డు పొందిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ఉపాధికార సంస్థ(యూఐడీఏఐ) సూచిస్తున్నది.

read also: TDP-JSP : టీడీపీ, జనసేన రెండో జాబితా సిద్ధమైంది..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aadhaar
  • extended
  • Free Aadhaar Update
  • myaadhaar

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd