UP : దళిత మహిళను అత్యాచారం చేసి..తర్వాత ముక్కలు ముక్కలుగా నరికేశారు
బాందాలో ఓ దళిత మహిళపై కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా అనంతరం ఆమెను ముక్కలుగా కోసి హత్యచేశారు
- Author : Sudheer
Date : 04-11-2023 - 10:27 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లో ఇటీవల కాస్త క్రైమ్ తగ్గిందనుకునేలోపే దారుణాలు వెలుగులోకి వస్తూ…మళ్లీ వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి. ముఖ్యంగా అత్యాచారాలు కేరాఫ్ గా యూపీ మారింది. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. అత్యాచారం చేయడం..తర్వాత హత్య చేయడం చేస్తున్నారు. పోలీసులు , కోర్ట్ లు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి రాగా…తాజాగా మరో దారుణ ఘటన వెలుగులో వచ్చింది. బాందాలో ఓ దళిత మహిళ (Dalit woman)పై కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా అనంతరం ఆమెను ముక్కలుగా కోసి హత్యచేశారు. అక్టోబరు 31న ఈ ఘటన చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
పోలీసులు తెలిపిన ప్రకారం…
బాందా (Banda District)కు చెందిన ఓ దళిత మహిళ స్థానికంగా ఉండే రాజ్‌కుమార్ శుక్లా (Rajkumar Shukla) అనే వ్యక్తి ఇంట్లో ఫ్లోర్ మిల్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలో మిల్ శుభ్రం చేయడానికి శుక్లా ఇంటికి వెళ్లింది సదరు మహిళ. అయితే చాలాసేపైనా తల్లి ఇంటికి రాకపోవడంతో ఆమె కుమార్తె అక్కడికి వెళ్లింది. ఇంట్లోని ఓ గదిలోంచి మహిళ అరుపులు వినిపించాయి. అక్కడికి వెళ్లి చూసేసరికి.. ఆమె తల్లి మూడు ముక్కలై రక్తపు ముడుగులో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి రాజ్‌కుమార్, అతడి సోదరులు బావు శుక్లా, రామకృష్ణ శుక్లాలను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని, నిందితులు ముగ్గురు పారిపోయారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై విపక్ష నేత, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్‌లో స్పందిస్తూ, బాందాలో జరిగిన ఈ ఘటన మనసు తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.
Read Also : Attack On Pak : పాక్ వైమానిక స్థావరంపై సూసైడ్ ఎటాక్.. ఏమైందంటే ?