Delhi New MLAs : నేరచరితులు తగ్గారు.. ఆస్తిపరులు పెరిగారు.. ఢిల్లీ కొత్త ఎమ్మెల్యేలపై నివేదిక
ఢిల్లీలో ఎన్నికైన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలలో(Delhi New MLAs) 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఇలాంటి ఎమ్మెల్యేల సంఖ్య 43.
- By Pasha Published Date - 07:54 PM, Sun - 9 February 25

Delhi New MLAs : ఢిల్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి ? ఎంతమందికి భారీగా ఆస్తులు ఉన్నాయి ? ఎంతమందికి తక్కువ ఆస్తులు ఉన్నాయి ? ఎంతమందికి అప్పులు ఎక్కువ ? ఇలాంటి సమాచారం మొత్తం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఈ అంశాలపై వివరాలన్నీ సేకరించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ రూపొందించిన నివేదికలోని సమాచారం ఇలా ఉంది..
Also Read :Manipur CM Resignation: మణిపూర్‌లో సంచలన పరిణామం.. సీఎం బీరేన్‌సింగ్ రాజీనామా
ఏడీఆర్ ప్రకారం కొత్త ఎమ్మెల్యేల నేరచరిత్ర..
- ఢిల్లీలో ఎన్నికైన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలలో(Delhi New MLAs) 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఇలాంటి ఎమ్మెల్యేల సంఖ్య 43.
- ఢిల్లీ కొత్త ఎమ్మెల్యేల్లో 17 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఇలాంటి ఎమ్మెల్యేల సంఖ్య 37.
- బీజేపీ నుంచి ఈసారి గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో 16 మందిపై, ఆప్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేల్లో 15 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
- బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆప్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.
ఏడీఆర్ ప్రకారం కొత్త ఎమ్మెల్యేల ఆస్తులు
- ఢిల్లీలో ఈసారి గెలిచిన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలకు రూ.1,542 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకు సగటున రూ.22.04 కోట్ల ఆస్తి ఉంది.
- ఈసారి ఆస్తులపరంగా బీజేపీ ఎమ్మెల్యేలే టాప్. బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.28.59 కోట్లు. ఆప్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.7.74 కోట్లే.
- ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తి రూ.115 కోట్ల నుంచి రూ.259 కోట్ల రేంజులో ఉంది.
- అత్యంత సంపన్న బీజేపీ ఎమ్మెల్యే కర్నైల్ సింగ్.ఈయనకు రూ.259.67 కోట్ల ఆస్తి ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు మంజీందర్ సింగ్ సిర్సాకు రూ.248.85 కోట్ల ఆస్తి, పర్వేశ్ వర్మకు రూ.115.63 కోట్ల ఆస్తి ఉంది.
- అరవింద్ కేజ్రీవాల్‌పై గెలిచిన బీజేపీ నేత పర్వేశ్ వర్మ అప్పుల విషయంలో నంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఈయనకు రూ.74 కోట్ల అప్పులు ఉన్నాయి.
- 23 మంది కొత్త ఎమ్మెల్యేలకు రూ.1 కోటికిపైగా అప్పులు ఉన్నాయి.
- ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేల ఆస్తి విలువ రూ.20 లక్షలలోపే.