Bittu Bajrangi Arrest : నూహ్ మత ఘర్షణల నిందితుడు బిట్టూ బజరంగీ అరెస్ట్
Bittu Bajrangi Arrest : హర్యానాలోని నూహ్ లో జులై 31న జరిగిన మత ఘర్షణల్లో కీలక నిందితుడిగా భావిస్తున్న గో రక్షకుడు బిట్టూ బజరంగీని పోలీసులు ఇవాళ సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు.
- By Pasha Published Date - 10:46 AM, Wed - 16 August 23

Bittu Bajrangi Arrest : హర్యానాలోని నూహ్ లో జులై 31న జరిగిన మత ఘర్షణల్లో కీలక నిందితుడిగా భావిస్తున్న గో రక్షకుడు బిట్టూ బజరంగీని పోలీసులు ఇవాళ సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు. అతడిని పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిట్టూ బజరంగీతో పాటు బజరంగ్‌దళ్ కార్యకర్త మోనూ మనేసర్ చేసిన కామెంట్ల వల్లే నూహ్ లో మతకలహాలు చెలరేగాయని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
Also read : WhatsApp AI Stickers : వాట్సాప్ లో ఏఐ స్టిక్కర్స్ .. ఛాట్ చేస్తూనే క్రియేట్ అండ్ షేర్ చేయొచ్చు
VIDEO | Bittu Bajrangi, a Bajrang Dal member, has been arrested in connection with violence in Haryana's Nuh.
(Source: Third Party) pic.twitter.com/SC04SydgiY
— Press Trust of India (@PTI_News) August 15, 2023
ఈ నేపథ్యంలో ఘర్షణలు జరిగిన 20 రోజుల తర్వాత ఫరీదాబాద్ సమీపంలో బిట్టూ బజరంగీని పోలీసులు అరెస్ట్ (Bittu Bajrangi Arrest) చేశారు. ఇందుకు సంబంధించి స్థానికంగా ఉన్న ఒక సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సివిల్ డ్రెస్సుల్లో తుపాకులు, చేతిలో కర్రలతో ఉన్న పోలీసులు ఛేజ్ చేసి బిట్టూను పట్టుకున్నారు. అల్లర్లు రేకెత్తించడం, హింస, బెదిరింపులు, ప్రభుత్వ పనికి అడ్డంకులు సృష్టించడం, ప్రభుత్వాధికారిని విధుల్లో అడ్డుకొని ఆయుధంతో దాడిచేయడం వంటి ఆరోపణలను బిట్టూ బజరంగీ ఎదుర్కొంటున్నాడు.
Also read : IPhone 14 Battery Draining : ఏడాదైనా కాకముందే.. ఐఫోన్ 14లో బ్యాటరీ సమస్యలు!