WhatsApp AI Stickers : వాట్సాప్ లో ఏఐ స్టిక్కర్స్ .. ఛాట్ చేస్తూనే క్రియేట్ అండ్ షేర్ చేయొచ్చు
WhatsApp AI Stickers : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది.. మనం ఇతరులతో చాట్ చేస్తుండగా.. అప్పటికప్పుడు శరవేగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో స్టిక్కర్‌లను అందించడమే ఈ ఫీచర్ స్పెషాలిటీ.
- By Pasha Published Date - 09:47 AM, Wed - 16 August 23

WhatsApp AI Stickers : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది..
మనం ఇతరులతో ఛాట్ చేస్తుండగా.. అప్పటికప్పుడు శరవేగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో స్టిక్కర్‌లను అందించడమే ఈ ఫీచర్ స్పెషాలిటీ.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా లేటెస్ట్ వర్షన్ లో కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారులతో దీన్ని టెస్ట్ చేస్తున్నారు.
ఈ ఫీచర్ త్వరలోనే వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
Also read : Super Mosquitoes : సూపర్ మగ దోమలు రిలీజ్ చేస్తున్నారహో.. ఆడదోమల ఖేల్ ఖతం!
AI స్టిక్కర్లు అంటే ఏమిటి ?
AI స్టిక్కర్లు అంటే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి సృష్టించే ఫోటోలు. స్టిక్కర్ ఎలా ఉండాలి అనే వివరాలను వాట్సాప్ యూజర్స్ అందిస్తే.. అందుకు అనుగుణమైన, సరిపడే పోలికలున్న ఫోటోలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఫీచర్ అందిస్తుంది. స్టిక్కర్ ఎలా ఉండాలనే దానిపై రెండు, మూడు పదాలను టైప్ చేయగానే అందుకు అనుగుణమైన స్టిక్కర్లను AI టెక్నాలజీ అప్పటికప్పుడు క్రియేట్ చేసి మీ కళ్లెదుట ప్రత్యక్షం చేస్తుంది. AI స్టిక్కర్లను వాట్సాప్ యూజర్ వెంటనే తాను ఛాట్ చేస్తున్న వారితో షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్ల చాటింగ్ కు క్రియేటివిటీని యాడ్ చేస్తుంది. ఇది యూజర్స్ వాట్సాప్ ఛాట్స్ లో గడిపే టైంను మరింత పెంచుతుందని అంటున్నారు. ఫలితంగా వాట్సాప్ అడిక్షన్ మరింత పెరిగే ముప్పు ఉంది . AI స్టిక్కర్ల(WhatsApp AI Stickers) ఫీచర్ మన కోసం మెసేజ్ లు కూడా టైప్ చేసి పెట్టగలదని అంటున్నారు.
Also read : Today Horoscope : ఆగస్టు 16 బుధవారం రాశి ఫలితాలు.. వారు వాహన వినియోగంలో జాగ్రత్త వహించాలి