Covid Vaccination: మెదలైన పిల్లల వాక్సినేషన్. ఇలా రిజిస్ట్రేషన్ చేనుకోండి
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు జనవరి 3వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
- Author : Siddartha Kallepelly
Date : 03-01-2022 - 7:11 IST
Published By : Hashtagu Telugu Desk
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు జనవరి 3వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
పిల్లల వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనవరి 1 నుంచే కొవిన్ పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చింది. పిల్లల వాక్సిన్ కోసం ఇప్పటివరకు 6 లక్షల 35 వేల మంది కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
పిల్లల వ్యాక్సినేషన్‌ను సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్ని రాష్ట్రాలకు సూచించారు. పిల్లలకోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. వాక్సిన్ ఏవిధంగా ఇవ్వాలో అనే అంశంపై అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది.
పిల్లల వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్ర మంత్రి సూచించారు. పెద్దల కోసం కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారో పిల్లలకు కూడా అలాగే చేసుకోవాలని, పిల్లలు తమ ఫోన్ ద్వారా లేదా తమ కుటుంబ సభ్యుల ఫోన్ నంబరుతో లాగిన్ అయి నమోదు చేసుకోవచ్చు. దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్లో కూడా పేరు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.