Doctor Murder : జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యం.. కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌పై అవినీతి కేసు
కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలతో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై కోల్‌కతా పోలీసులు కేసు(Doctor Murder) నమోదు చేశారు.
- By Pasha Published Date - 11:14 AM, Tue - 20 August 24

Doctor Murder : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై ఆగస్టు 9న తెల్లవారుజామున జరిగిన హత్యాచారం ఘటన యావత్ దేశంలో కలకలం రేపుతోంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలతో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై కోల్‌కతా పోలీసులు కేసు(Doctor Murder) నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి దీనికి సంబంధించి పోలీసులకు జూన్ నెలలోనే ఫిర్యాదు అందింది. ఎట్టకేలకు ఇప్పుడు సందీప్ ఘోష్‌పై కేసు నమోదు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
2021 సంవత్సరం నుంచి ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. బెంగాల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రణబ్ కుమార్ నేతృత్వంలోని ఈ సిట్‌లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సయ్యద్ వకార్ రజా, సీఐడీ డీఐజీ సోమ మిత్ర దాస్, కోల్‌కతా పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ సభ్యులుగా ఉన్నారు. సందీప్ ఘోష్ ప్రిన్సిపల్‌గా ఉన్న టైంలో కాలేజీలో జరిగిన అవకతవకలపై ఈ టీమ్ దర్యాప్తు చేయనుంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న తెల్లవారుజామున జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగాక.. రెండు రోజులకే కాలేజీ ప్రిన్సిపల్ పదవికి సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో గత నాలుగు రోజులుగా ఆయన్ను సీబీఐ కూడా ప్రశ్నిస్తోంది. జూనియర్ వైద్యురాలిగా కంటిన్యూగా 36 గంటల డ్యూటీ వేయడంపై, ఘటన జరిగిన రోజు కాలేజీలో లేకపోవడంపై ఘోష్‌ను సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.
Also Read :Trump – Musk : అధ్యక్షుడినైతే కీలక పదవిని ఇస్తానన్న ట్రంప్.. మస్క్ స్పందన ఇదీ
సెమినార్ హాల్‌లో లభ్యమైన క్లూస్‌పై , ఆరోజు తెల్లవారుజామున ప్రధాన నిందితుడు, సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ సెమినార్ హాల్‌లో కనిపించడంపైనా సందీప్ ఘోష్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు. జూనియర్ వైద్యురాలు సూసైడ్ చేసుకుందని చెప్పి.. ఆమె తల్లిదండ్రులకు తప్పుడు సమాచారాన్ని ఎందుకు అందించారనేది కూడా సీబీఐ టీమ్ సందీప్ ఘోష్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ కేసులో మొట్టమొదట అరెస్టయిన వ్యక్తి సంజయ్ రాయ్. అతడికి ఇప్పటికే సైకో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించారు. త్వరలోనే లై డిటెక్టర్ టెస్టు కూడా నిర్వహించనున్నారు. ఇందుకుగానూ ఇప్పటికే కోల్‌కతా హైకోర్టు నుంచి సీబీఐ సోమవారమే అనుమతులు పొందింది.