HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Congress Zero In Bengal

West Bengal Result 2026 : బెంగాల్లో కాంగ్రెస్ ‘జీరో’

ఐదు రాష్ట్రాల్లో కేరళ ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఊరటనిస్తోంది. అక్కడ పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF)పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు వరంగా మారింది. యూడీఎఫ్ (UDF) కూటమి ఏకంగా 99 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా

  • Author : Sudheer Date : 04-05-2026 - 3:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
West Bengal Congress
West Bengal Congress

ఐదు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు తుది దశకు చేరుకుంటున్న వేళ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు గాను, ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా ఆధిక్యంలో లేదు. గతంలో కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ’ ఖాతా తెరవకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బెంగాల్ ఓటర్లు కేవలం బీజేపీ మరియు టీఎంసీ మధ్యే పోటీని చూశారు తప్ప, కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా భావించలేదని ఈ ‘బిగ్ జీరో’ స్పష్టం చేస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ హవా ముందు కాంగ్రెస్ ఉనికి పూర్తిగా కనుమరుగైపోయింది.

దక్షిణాదిలో దెబ్బ.. అస్సాంలో నామమాత్రం

తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకుని 28 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్, కేవలం ఐదు చోట్ల మాత్రమే లీడింగులో ఉండటం ఆ పార్టీ బలహీనతను సూచిస్తోంది. ఇక్కడ విజయ్ (TVK) ప్రభంజనం వల్ల పొత్తుల లెక్కలు తారుమారయ్యాయి. అస్సాంలో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. గౌరవ్ గొగోయ్ నేతృత్వంలో 100కు పైగా స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, కేవలం 24 సీట్లకే పరిమితం కావడం గమనార్హం. అక్కడ హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా వెళ్తుండటంతో కాంగ్రెస్‌కు నిరాశే మిగిలింది.

కేరళలో మాత్రమే కాంగ్రెస్ ‘హస్త’లాఘవం

ఐదు రాష్ట్రాల్లో కేరళ ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఊరటనిస్తోంది. అక్కడ పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF)పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు వరంగా మారింది. యూడీఎఫ్ (UDF) కూటమి ఏకంగా 99 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా, అందులో కాంగ్రెస్ పార్టీ స్వతహాగా 60కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. కేరళలో లభించిన ఈ విజయం రాహుల్ గాంధీ నాయకత్వానికి కొంత ఊపిరి పోసినట్లయినా, జాతీయ స్థాయిలో మాత్రం పార్టీ పునరుజ్జీవనంపై పెద్ద ప్రశ్నార్థకాన్నే మిగిల్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AssamPolls
  • congress
  • ElectionResults2026
  • KeralaElection
  • PoliticalNews
  • rahulgandhi
  • TamilNaduElection2026
  • WestBengalResults

Related News

Rahul Vote Chori Haryana

Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ సోషల్ మీడియా వేదికగా చేసిన 'సెంచరీ' సెటైర్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

  • Kerala Cpi

    Kerala: ఎర్ర జెండా ను పట్టించుకోని ఓటర్లు

  • Ganesh Trsha

    Tamil Nadu Election Results 2026 : త్రిష కోరిక నెరవేరిందంటూ బండ్ల గణేశ్ ట్వీట్

  • Vijay Car Driver Son Tvk Pa

    Tamil Nadu Election Results 2026 : ముందంజలో విజయ్ కారు డ్రైవర్ కొడుకు

  • Tamilisai

    Tamilisai Soundararajan : తమిళిసైకి వరుసగా ఏడో ఓటమి!

Latest News

  • Kerala Election Results : కేరళంలో గేమ్ ఛేంజర్ గా ‘రేవంత్ రెడ్డి’

  • Tamilnadu Results : సీఎం ఓడిపోయాడు..డిప్యూటీ సీఎం గెలిచాడు !!

  • TVK VIjay : రెండు చోట్ల విజయ్ అఖండ విజయం..!!

  • TRS : విజయ్ బాటలో కల్వకుంట్ల కవిత

  • Tamilnadu Results : సీఎంనే ఓడించాడు.. ఎవడ్రా ఈ V .S బాబు?

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd