UP Elections: యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్న కాంగ్రెస్
2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలిపారు.
- By Hashtag U Published Date - 11:10 PM, Sun - 14 November 21

2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలిపారు. మొత్తం 403 స్థానాల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేసి విజయం సాధిస్తామని ఆమె తెలిపారు. ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ఆమె, 2017లో ఉన్నావ్ రేప్ కేసు, హత్రాస్ గ్యాంగ్ రేప్-మర్డర్ కేసుల్లో కూడా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (ఎస్పీ) నాయకులు ఎక్కడా కనిపించలేదని అన్నారు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే ప్రజల కోసం పోరాడుతోందని అన్నారు.
Also Read: ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై అంతర్జాతీయ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించిన షారుఖ్
అనూప్‌షహర్‌లో జరిగిన ప్రతిజ్ఞ సమ్మేళన్ – లక్ష్య 2022లో పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఎంత ప్రాధాన్యతో క్యాడర్ కి తెలిపారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి “డూ-ఆర్-డై” పరిస్థితి అని తెలిపారు
WATCH: Smt. @priyankagandhi addresses party workers in UP
https://t.co/f9iTDoaxLa— Congress (@INCIndia) November 14, 2021
బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారానే ఎన్నికల పోటీలో విజయం సాధించగలమని…బూత్ కమిటీలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, పార్టీ కార్యక్రమాలన్నింటిని వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేయాలని ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతలంటే కాషాయ పార్టీకి గౌరవం లేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా సోదరభావాన్ని, సామరస్యాన్ని పెంపొందించిందని ప్రియాంక గాంధీ అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలపై బీజేపీ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.
Also Read: గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్. 26 మంది మావోయిస్టులు హతం, మృతుల్లో కేంద్ర కమిటీ
aa https://twitter.com/INCIndia/status/1459865056821145606