బీజేపీలో చేరిన గులాంనబీ అజాద్ మేనల్లుడు.. కాంగ్రెస్ ఆ పని చేసినందుకే…?
- By hashtagu Published Date - 06:52 PM, Sun - 27 February 22
ప్రముఖ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మేనల్లుడు ముబాషర్ ఆజాద్ ఆదివారం జమ్మూలోని త్రికూట నగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. జమ్ము కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, మాజీ ఎమ్మెల్యే దలీప్ పరిహార్, బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు హరూన్ చౌధురిలు ఆయనకు కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీలు అధికార విలాసాలు అనుభవించడం తప్ప మరేమీ చేయలేదని జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, ఆరోపించారు.
జమ్మూ & కాశ్మీర్‌లో ప్రాథమిక స్థాయిలో ప్రజాస్వామ్యం పటిష్టం అయ్యేలా ఇక్కడ నివసించే ప్రతి వర్గానికి హక్కులు కల్పించేందుకు ‘గణనీయమైన చర్యలు’ తీసుకున్నది కేవలం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమేనని ఆయన అన్నారు. బీజేపీ నాయకత్వ విధానాలను అందరూ మెచ్చుకుంటున్నారని, అందుకే దాదాపు ప్రతిరోజూ, చురుకైన సామాజిక మరియు రాజకీయ ప్రముఖులు ప్రజలకు సేవ చేయడానికి పార్టీని స్వీకరించడానికి ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. ముబాషర్ ఆజాద్ సారథ్యంలోని ఈ కొత్త చేరికలు దోడా, కిష్త్వార్, రాంబన్, ఇతర ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా, జమ్మూ & కాశ్మీర్‌లోని మొత్తం ప్రాంత యువతను దేశం, సమాజం కోసం పని చేసేలా ప్రోత్సహిస్తారని రైనా తెలిపారు
ఇదిలా ఉండగా జమ్మూ & కాశ్మీర్‌లో మరియు కేంద్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం తన మామ, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ను అగౌరవపరిచినందుకు తాను తీవ్రంగా బాధపడ్డానని ముబాషర్ ఆజాద్ అన్నారు. గులాం నబీ ఆజాద్ పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు సామాన్య ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, మాజీ సీఎం ఆజాద్ కృషికి ప్రధాని మోదీ గుర్తింపు ఇచ్చారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా స్వార్థపూరిత అంతర్గత పోరు నడుస్తుండగా, ప్రధాని మోదీ సామాన్య ప్రజల విశ్వాసాన్ని పొందారనని తెలిపారు. సమాజం, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ, బీజేపీతో కలిసి నిలబడతామని ఆయన పేర్కొన్నారు.
Mubashar Azad, nephew of veteran Congress leader Ghulam Nabi Azad, joined BJP at the party’s headquarters at Trikuta Nagar in Jammu pic.twitter.com/yLGqr3Gh0e
— ANI (@ANI) February 27, 2022