Suspicious Signals : బంగ్లాదేశ్ బార్డర్‌లో ‘ఉగ్ర’ సిగ్నల్స్ కలకలం.. భారత్ అలర్ట్
ఈనేపథ్యంలో గత రెండు నెలలుగా(డిసెంబరు, జనవరి నెలల్లో) బెంగాల్‌లోని బంగ్లాదేశ్ బార్డర్‌లో ఉర్దూ, బెంగాలీ, అరబిక్ కోడ్ భాషల్లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లను(Suspicious Signals) తమ ఆపరేటర్లు గుర్తించారని అమెచ్యూర్ హామ్ రేడియో సంస్థ తెలిపింది.
- By Pasha Published Date - 03:47 PM, Sun - 9 February 25

Suspicious Signals : అనుమానాస్పద రేడియో సిగ్నల్స్‌తో పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ బార్డర్‌లో కలకలం రేగింది. ఉర్దూ, బెంగాలీ, అరబిక్ కోడ్ భాషల్లో ఉన్న ఆ సిగ్నల్స్ ఎవరివి ? అనే సందేహాలు రేకెత్తాయి. హామ్ రేడియోలతో బార్డర్‌లో రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారు ? ఎవరు మాట్లాడుకుంటున్నారు ? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. వివరాలివీ..
Also Read :Delhi CM : ఢిల్లీ సీఎం రేసు.. కొత్త పేరు తెరపైకి !
అరబిక్ భాషలోనూ సిగ్నల్స్..
బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం పూర్తి భిన్నంగా ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం ఇప్పుడు పాకిస్తాన్‌తో అంటకాగుతోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లో బంగ్లాదేశ్ ఆర్మీ భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో గత సంవత్సరం (2024) ఆగస్టు నుంచి బంగ్లాదేశ్ బార్డర్‌లో భారత్ అలర్ట్ మోడ్‌లోకి వచ్చింది. ఈనేపథ్యంలో గత రెండు నెలలుగా(డిసెంబరు, జనవరి నెలల్లో) బెంగాల్‌లోని బంగ్లాదేశ్ బార్డర్‌లో ఉర్దూ, బెంగాలీ, అరబిక్ కోడ్ భాషల్లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లను(Suspicious Signals) తమ ఆపరేటర్లు గుర్తించారని అమెచ్యూర్ హామ్ రేడియో సంస్థ తెలిపింది. బెంగాలీ భాష బంగ్లాదేశ్, బెంగాల్‌లలో రెండుచోట్లా బాగా వినియోగంలో ఉంటుంది. ఉర్దూ భాష బంగ్లాదేశ్‌లో బాగా జన వినియోగంలో ఉంటుంది. అరబిక్ భాషను అటు బంగ్లాదేశ్ ప్రజలు కానీ, ఇటు బెంగాల్ ప్రజలు కానీ వినియోగించరు. ఈ భాషల వినియోగం లెక్కన చూస్తే.. హామ్ రేడియోల ద్వారా బెంగాల్-బంగ్లాదేశ్ బార్డర్‌లో మాట్లాడుకున్న వారు బంగ్లాదేశీయులే అని తేటతెల్లం అవుతోంది. అరబిక్ భాషను వినియోగిస్తున్న వారు అరబ్ దేశాలకు చెందిన ఉగ్రవాదులై ఉండొచ్చనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.
Also Read :Maoists Encounter: మరో ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు హతం.. ఇద్దరు జవాన్ల మృతి
భారత్ సీరియస్
బంగ్లాదేశ్‌తో పాక్ సన్నిహితంగా మెలుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ అంశాన్ని భారత్ సీరియస్‌గా తీసుకుంది. సరిహద్దుల్లో ఆ అలికిడి ఎవరిది ? అనేది తెలుసుకోవడంపై ఫోకస్ పెట్టింది. జనవరిలో గంగాసాగర్ మేళా జరిగిన టైంలో కొందరు అమెచ్యూర్ హామ్ రేడియో వినియోగదారులు తమకు అనుమానాస్పద సిగ్నల్స్ వినిపించాయని కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై అమెచ్యూర్ హామ్ రేడియో నిర్వాహకులు వెంటనే భారత కమ్యూనికేషన్ల శాఖకు సమాచారాన్ని అందించారు. బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కమ్యూనికేషన్ కోసం వినియోగించిన ఉర్దూ, బెంగాలీ, అరబిక్ కోడ్ భాషలను డీకోడ్ చేయడానికి కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ స్టేషన్ (రేడియో)కు సమాచారాన్ని పంపారు. స్మగ్లర్లు, తీవ్రవాద గ్రూపులే మాట్లాడుకోవడానికి ఇలాంటి సీక్రెడ్ కోడ్‌లను వాడుతుంటారని అంటున్నారు.