Delhi CM : ఢిల్లీ సీఎం రేసు.. కొత్త పేరు తెరపైకి !
అనూహ్యంగా ఢిల్లీ సీఎం(Delhi CM) పదవి కోసం కూడా మోహన్ పేరును పరిశీలించే అవకాశాలు లేకపోలేదని పలువురు అంచనా వేస్తున్నారు.
- By Pasha Published Date - 02:57 PM, Sun - 9 February 25

Delhi CM : ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరు ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతున్న తరుణంలో ఒక కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆయనే .. మోహన్ సింగ్ బిష్త్. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మోహన్‌కు కాల్ చేసి మాట్లాడారు. ఈవిషయాన్ని మీడియా ప్రతినిధులకు మోహన్ సింగ్ బిష్త్ స్వయంగా తెలియజేశారు. ఇంతకీ ఎవరీ మోహన్ సింగ్ బిష్త్ ? ఢిల్లీలో బీజేపీ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో ఆయనకు ఏ పదవి దక్కబోతోంది ? ఈ కథనంలో చూద్దాం..
Also Read :Maoists Encounter: మరో ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు హతం.. ఇద్దరు జవాన్ల మృతి
ఎవరీ మోహన్ సింగ్ బిష్త్ ?
- ఢిల్లీలోని బీజేపీ సీనియర్ నేతల్లో మోహన్ సింగ్ బిష్త్ ఒకరు.
- ముస్తఫాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా మోహన్ ఎన్నికయ్యారు.
- ముస్తఫాబాద్ అసెంబ్లీ స్థానంలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ. అయినా బీజేపీకి మోహన్ విజయాన్ని సాధించిపెట్టారు.
- 2020లో ఢిల్లీలో మతపరమైన అల్లర్లు జరిగినప్పుడు ప్రధానంగా ప్రభావితమైన ప్రాంతం ముస్తఫాబాద్.
- 2020లో ఢిల్లీలో అల్లర్లు జరిగిన సమయంలో ముస్తాఫాబాద్ ప్రాంతంలో ఒక వార్డుకు కౌన్సిలర్‌గా తాహిర్ హుస్సేన్ ఉండేవారు. ఢిల్లీ అల్లర్లలో తాహిర్‌ను నిందితుడిగా చేర్చిన తర్వాత ఆయన్ను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సస్పెండ్ చేసింది. ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తరఫున తాహిర్ పోటీ చేశారు.
- ముస్తఫాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మోహన్ గెలవడం వరుసగా ఇది రెండోసారి.
- తాహిర్‌ను ఓడించడంలో సక్సెస్ అయిన నేపథ్యంలో మోహన్ సింగ్ బిష్త్‌ను ఫోన్ కాల్‌లో అమిత్ షా అభినందించారని తెలిసింది.
- ఢిల్లీలో ఏర్పాటు కానున్న బీజేపీ ప్రభుత్వంలో మోహన్‌కు కీలకమైన పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.
- ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ పదవికి మోహన్ పేరును బీజేపీ పెద్దలు పరిశీలించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
- అనూహ్యంగా ఢిల్లీ సీఎం(Delhi CM) పదవి కోసం కూడా మోహన్ పేరును పరిశీలించే అవకాశాలు లేకపోలేదని పలువురు అంచనా వేస్తున్నారు.
Also Read :Maha Shivaratri: మహా శివరాత్రి రోజు ఏం చేయాలి.. ఏం చేస్తే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ఈ ఐదుగురు
బీజేపీ నేత పర్వేశ్ వర్మ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించారు. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే ఈ పర్వేశ్ వర్మ. కేజ్రీవాల్‌ను ఓడించబట్టి, ఈయన్నే సీఎం అభ్యర్థిగా అందరూ భావిస్తున్నారు. మాలవీయ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ్, రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా, జనక్ పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్‌లు కూడా సీఎం రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై వారంలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.