UP DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం యోగీ దీపావళి గిఫ్ట్..4శాతం డీఏ, బోనస్..!!
ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా 4శాతం డీఎ, బోనస్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు.
- By hashtagu Published Date - 06:21 AM, Tue - 18 October 22

ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా 4శాతం డీఎ, బోనస్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు 4శాతం డీఎను పెంచారు. దీంతోపాటు దీపావళి నాడు ప్రతి ఉద్యోగికి 6908రూపాయలు బోనస్ కూడా అందించనుంది యూపీ ప్రభుత్వం. గతంలో ఉద్యోగులకు 34శాతం డీఎ ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు 38శాతానికి పెంచారు. ఈ పెంపుదల జూలె 1,2022 నుంచి అమల్లోకి వస్తుందని యోగి తెలిపారు. గత మూడు నెలల బకాయిలను కూడా ఉద్యోగులకు అందజేస్తామని స్పష్టం చేశారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ కు రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లు అభినందనలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూలై 01, 2022 నుండి రాష్ట్ర ఉద్యోగులు పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్లకు కరువు భత్యం డియర్నెస్ రిలీఫ్ రేటును 34 శాతం నుండి 38 శాతానికి పెంచింది. ప్రతి ఉద్యోగికి 6,908 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. బోనస్ ఇవ్వాలని నిర్ణయించాం. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు!” అంటూ ట్వీట్ చేశారు.