Revanth Meets Modi : ప్రధాని మోడీ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Revanth Meets Modi : రాష్ట్ర వాణిజ్య, రవాణా వ్యవస్థలను మరింత మెరుగుపరచే క్రమంలో హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు
- Author : Sudheer
Date : 24-05-2025 - 8:55 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) శనివారం నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ (NITI Aayog) సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని ఆయన ప్రధానిని అభ్యర్థించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు అనుమతులు త్వరగా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Minister Instructions: కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణపై సమీక్ష.. మంత్రి కీలక సూచనలు!
అలాగే వ్యూహాత్మక ప్రాజెక్ట్ అయిన రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర, దక్షిణ భాగాలకు ఒకేసారి మంత్రివర్గ అనుమతులు, ఆర్థిక మంజూరులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. దక్షిణ భాగానికి అవసరమైన భూసేకరణ ఖర్చులో సగం (50 శాతం) రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని ఆయన తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన ప్రధానిని కోరారు.
ఇంకా రాష్ట్ర వాణిజ్య, రవాణా వ్యవస్థలను మరింత మెరుగుపరచే క్రమంలో హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించేలా గ్రీన్‌ఫీల్డ్ రోడ్ మరియు రైల్వే మార్గాలను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా కొత్త గ్రీన్‌ఫీల్డ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు, సహకారం కోరారు. ఇవన్నీ తెలంగాణ అభివృద్ధిలో మైలురాళ్లుగా నిలుస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.