Maharashtra Elections : శిండే.. అజిత్ పవార్ లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Maharashtra Election : శిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని పేర్కొన్నారు. చంద్రాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్ ను 50 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు.
- By Sudheer Published Date - 02:53 PM, Sat - 16 November 24

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం (maharashtra election campaign)లో శిండే-అజిత్ పవార్ (Shinde-Ajit Pawar)పై కీలక వ్యాఖ్యలు చేసారు. వీరు గుజరాత్ గులాంలుగా మారారని విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మహారాష్ట్ర చంద్రాపూర్ నియోజవర్గం గుగ్గూస్ లో మాట్లాడుతూ..మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్ నాథ్ శిండే… అజిత్ పవార్ కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని పేర్కొన్నారు. చంద్రాపూర్ (Chandrapur) లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్ (Congress candidate Praveen Padwakar) ను 50 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ప్రవీణ్ ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న , హైదరాబాద్ లో మరో అన్నగా నేను ఉంటానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ , రూ.500 లకే గ్యాస్ సిలండర్ అందజేస్తున్నామని, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఏడాది కాలంలో తెలంగాణలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని క్లారిటీ ఇచ్చారు. ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని ఎద్దేవా చేసారు.
ఇక ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ నేపధ్యంలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష ఇండియా కూటమి గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు.
Read Also : Maharashtra Elections : సనాతనాన్ని రక్షించడానికే శివసేన- జనసేన ఆవిర్భవించాయి – పవన్ కళ్యాణ్