CM Criminal Case : అంతర్జాతీయ కోర్టులో CMపై కేసు, దావోస్ లో చేదుఅనుభవం
ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యానాథ్ పై (CM Criminal Case)
- By CS Rao Published Date - 04:05 PM, Thu - 19 January 23

ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యానాథ్ పై (CM Criminal Case) అంతర్జాతీయ న్యాయవాదుల బృందం క్రిమినల్ కేసు పెట్టింది. పౌరసత్వ సవరణ చట్టం(CAA)కు వ్యతిరేకంగా నిరసనలను దిగిన వాళ్లను అణిచివేసేందుకు డిసెంబర్ 2019 నుంచి జనవరి 2020 మధ్య మానవత్వాన్ని మరచి యోగి ఆదిత్యానాథ్ నేరాలకు పాల్పడ్డారని ఫిర్యాదు దాఖలైంది. వరల్డ్ ఎకామిక్ ఫోరమ్ కు హాజరయ్యేందుకు వెళ్లిన ఆదిత్యానాథ్ కు అంతర్జాతీయ న్యాయవాదుల గ్రూప్ ఇలాంటి జలక్ ఇచ్చింది. గ్వెర్నికా 37 ఛాంబర్స్ ద్వారా స్విస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో జనవరి 17న ఫిర్యాదు దాఖలు అయింది. స్విస్ క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 264 ప్రకారం జాతిహత్య, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసినట్టు భావిస్తూ యోగి మీద చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ నేర, మానవ హక్కుల న్యాయవాదుల ప్రత్యేక బృందం కోరింది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యానాథ్ పై (CM Criminal Case)
గ్వెర్నికా 37 గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు G37 ఛాంబర్స్ జాయింట్ హెడ్ టోబీ కాడ్‌మాన్ ఒక ఈ మెయిల్ ద్వారా స్పందించారు. పౌరులను జైలులో ఉంచడం, హింసించడం, హత్య చేయడం వంటి చర్యలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Criminal Case) ఆదేశించినట్లు బృందం భావిస్తోంది. మానవాళికి వ్యతిరేకంగా ఈ నేరాలుగా పరిగణించబడతాయని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెబుతోందని బృందం చెబుతోంది. దేశంలోని ముస్లిం జనాభాపై ఉద్దేశపూర్వక దాడులు జరిగినట్లు ఆరోపించింది.ముఖ్యమంత్రి యోగితో సహా యుపి ప్రభుత్వంలోని సీనియర్ సభ్యులు, యుపి పోలీసులను ఆదేశించిన ఆధారాలు ఉన్నాయని గ్వెర్నికా 37 ఛాంబర్స్ పేర్కొంది. డిసెంబరు 19, 2019న నిరసనకారులపై ‘పగ తీర్చుకోవాలని’ పోలీసులకు పిలుపునిస్తూ ఇచ్చిన ఒక ప్రసంగంలో పోలీసు హింస తీవ్రతరంగా ఉందని భావిప్తోంది. ముఖ్యమంత్రి ఈ నేరాలకు దౌత్యపరమైన మినహాయింపును పొందలేరని చెబుతోంది.
Also Read : Yogi Adityanath Brother : సీఎం యోగి సోదరుడు జవాన్ గా…
డిసెంబర్ 2019లో పౌరసత్వ (సవరణ) చట్టం (CAA)వ్యతిరేకంగా ముస్లిం సమాజానికి చెందిన వారు శాంతియుత నిరసనలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. పోలీసులు పలువుర్ని అరెస్టు చేసి దాడి చేశారు. “యుపి పోలీసులు 22 మంది నిరసనకారులను చంపారని, కనీసం 117 మందిని హింసించారని, 307 మందిని ఏకపక్షంగా నిర్బంధించారని గ్వెర్నికా 27 ఛాంబర్స్ పేర్కొంది. దేశీయ చట్టం, అంతర్జాతీయ చట్టం లేదా అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ రోమ్ శాసనం వ్యక్తిగత ఫిర్యాదులను అంగీకరించలేదని పేర్కొంటూ, “హింస మరియు శిక్షార్హత పెరగడానికి నేరస్తులను జవాబుదారీగా ఉంచడానికి తక్షణ చర్యలు అవసరం” అని వారు చెప్పారు.
గత ఏడాది అమెరికా ప్రభుత్వానికి ఇదే విధమైన ఫిర్యాదు
“స్విస్ అధికారులు దర్యాప్తు ప్రారంభించడం అనేది ఆరోపించిన నేరాల తీవ్రత, బాధితుల స్థితి ఆధారంగా ఉంటుంది. వాళ్లు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విఫలమవ్వడాన్ని సహించబోమని గ్వెర్నికా 37 ఛాంబర్స్ నొక్కిచెప్పారు. స్విస్ క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 264a మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు సంబంధించింది. ఈ నిబంధన కింద ఫిర్యాదు దాఖలయ్యింది. నేరస్థులను జవాబుదారీగా ఉంచడానికి ప్రయత్నాలు జరగడంలేదని క్యాడ్‌మాన్ చెప్పారు.సిఎం యోగికి వ్యతిరేకంగా ‘టార్గెటెడ్ ఆంక్షలు’ కోరుతూ లా సంస్థ గత ఏడాది అమెరికా ప్రభుత్వానికి ఇదే విధమైన ఫిర్యాదు దాఖలు చేసింది. ఆంక్షలు విధించడం కోసం US ట్రెజరీకి అభ్యర్థన చేశామని క్యాడ్‌మాన్ ప్పారు. ఇది కొంత సమయం పట్టే ప్రక్రియ. US ప్రభుత్వం ఆంక్షల విధింపును బహిరంగం పరిస్తే తప్ప బయటకు రాదని అన్నారు. UK (ఫారిన్, కామన్వెల్త్ మరియు డెవలప్‌మెంట్ ఆఫీస్) FCDOకి కూడా ఇదే విధమైన అభ్యర్థన చేశామని ఆయన అన్నారు.
Also Read : Yogi Adityanath: యూపీలో `యోగి` అరుదైన రికార్డ్