China pneumonia: చైనాలో న్యుమోనియా, రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్
చైనాలో చిన్నారులకు వ్యాపిస్తున్న న్యుమోనియా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే చలికాలంలో సాధారణ శ్వాసకోశ సమస్యలని చైనా మొదట చెప్పుకొచ్చింది.
- Author : Praveen Aluthuru
Date : 26-11-2023 - 6:03 IST
Published By : Hashtagu Telugu Desk
China pneumonia: చైనాలో చిన్నారులకు వ్యాపిస్తున్న న్యుమోనియా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే చలికాలంలో సాధారణ శ్వాసకోశ సమస్యలని చైనా మొదట చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చైనాను సంప్రదించి నివేదికను సంపాదించింది. ఇక భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన కేంద్రం.. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఒకవేళ ప్రమాదం ప్రాణాంతకంగా మారితే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం రాష్ట్రాలకు ఇప్పటికే సూచిందింది. మానవ వనరులు, ఆసుపత్రి పడకలు, సరిపడా మందులు, ఆక్సిజన్, యాంటీబాడీలు, పిపిఇ మరియు టెస్ట్ కిట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలకు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు పంపింది. చైనాలో న్యుమోనియా కేసుల వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపారు.
Also Read: Salaar T Shirt : మార్కెట్లోకి ‘సలార్’ షర్ట్స్..ధర చాల తక్కువే