Chhattisgarh CM : కొత్త జిల్లాలకు రూ.540కోట్ల భారీ కానున్న అందించిన సీఎం..!!
రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాలకు భారీ కానుక అందించారు ఛత్తీస్ ఘర్ సీఎం భూపేష్ బగెల్.
- By Bhoomi Published Date - 09:46 PM, Sat - 3 September 22

రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాలకు భారీ కానుక అందించారు ఛత్తీస్ ఘర్ సీఎం భూపేష్ బగెల్. ఆయా జిల్లాల్లో రూ. 540కోట్లతో అభివ్రుద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన సరాంఘర్, బిలాయ్ ఘర్, ఖైరాఘర్ చుయ్ ఖదన్, గండై జిల్లాలను 30,31 జిల్లాలుగా గుర్తించారు. వాటిని శనివారం ముఖ్యమంత్రి భూపేష్ బగెల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాల్లో రూ. 540కోట్లతో 46వేరు వేరు అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రజలకు సౌలభ్యమైన పరిపాలన అందించాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను పూర్తి చేశాం. ఇవాళ కొత్త ఏర్పడిన 30వ జిల్లా ప్రారంభమైంది. అని ట్వీట్ చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో 46 అభివ్రుద్ధి కార్యక్రమాలు సెప్టెంబర్ 3న ప్రారంభించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
Related News

Three People Burnt: విషాదం.. కారులో ముగ్గురు సజీవదహనం
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ (Bilaspur) జిల్లా రతన్‌పూర్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఓ కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. చెట్టును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తులు కారులో నుంచి దిగే అవకాశం లేకపోవడంతో వారు మృతి చెందారు.