HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Chaos In Jammu Kashmir Assembly After Engineer Rashids Brother Shows Article 370 Banner

Article 370 : అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైట్.. ‘ఆర్టికల్‌ 370’ బ్యానర్‌‌పై రగడ 

అసెంబ్లీ మార్షల్స్‌ రంగంలోకి దిగి..  దాడి చేసుకుంటున్న ఎమ్మెల్యేలను విడదీశారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలను(Article 370) సభ నుంచి బయటకు పంపారు.

  • By Pasha Published Date - 11:54 AM, Thu - 7 November 24
  • daily-hunt
Jammu Kashmir Assembly Article 370 Khurshid Ahmad Sheikh

Article 370 : జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఇవాళ మరోసారి అట్టుడికింది. ఈరోజు సెషన్ మొదలుకాగానే  ఇంజినీర్‌ రషీద్‌ సోదరుడు, అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్‌ అహ్మద్‌ షేక్‌ స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. తనతో తెచ్చుకున్న ఒక బ్యానర్‌ను ఆయన అందరి ఎదుట ప్రదర్శించారు. కశ్మీరుకు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించాలని ఆ బ్యానర్‌పై  రాసి ఉంది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్‌ శర్మ అభ్యంతరం తెలపడంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు.. అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్‌ అహ్మద్‌ షేక్‌‌పైకి దూసుకెళ్లారు. ఆయన చేతిలో ఉన్న బ్యానర్‌ను లాక్కొని చించేశారు. ఈక్రమంలో బీజేపీ, పీడీపీ పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  అసెంబ్లీ మార్షల్స్‌ రంగంలోకి దిగి..  దాడి చేసుకుంటున్న ఎమ్మెల్యేలను విడదీశారు.  గొడవలో పాల్గొన్న బీజేపీ, పీడీపీ ఎమ్మెల్యేలను(Article 370) మార్షల్స్ ఎత్తుకొని మరీ సభ బయటకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఖుర్షీద్‌కు అనుకూలంగా స్పీకర్‌ అబ్దుల్ రహీం రాథర్ పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈనేపథ్యంతో సభను  స్పీకర్‌ కొద్ది సేపు వాయిదా వేశారు.

Massive ruckus in Jammu and Kashmir Assembly.
BJP Vs NC-PDP over Article 370 resolution. #jk #jammukashmir pic.twitter.com/6OdGt3RcAX

— Surabhi Tiwari🇮🇳 (@surabhi_tiwari_) November 7, 2024

Also Read :AP MLC Elections : ‘గ్రాడ్యుయేట్’ ఓటర్ల నమోదుకు 20 వరకు ఛాన్స్.. అప్లై చేయడం ఇలా

జమ్మూకశ్మీరుకు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. దీన్ని పునరుద్ధ రించాలని కోరుతూ పీడీపీ ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. జమ్మూకశ్మీరుకు మునుపటిలా ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా ఇవ్వాలని కోరింది.  ఈనేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ బుధవారం రోజు అసెంబ్లీ తీర్మానం చేసింది. దాన్ని కూడా బీజేపీ  ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ తీర్మానం కాపీలను చింపేశారు. జాతి వ్యతిరేక శక్తులకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఆశ్రయం ఇస్తున్నాయని బీజేపీ నేతలు మండిపడ్డారు. మొత్తం మీద ఆరేళ్ల గ్యాప్ తర్వాత కశ్మీరులో జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్‌లో కీలక అంశంగా ఆర్టికల్ 370 మారింది.

Also Read :Kamal Haasan Birthday : నట ‘కమలం’.. 70వ వసంతంలోకి ‘విశ్వనటుడు’


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ARTICLE 370
  • Engineer Rashid
  • jammu kashmir
  • Jammu Kashmir Assembly
  • Khurshid Ahmad Sheikh

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd