PM Modi : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
PM Modi : హర్యానాలో హ్యాట్రిక్ విజయం తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్య విజయం అని పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 11:24 AM, Wed - 9 October 24

Central Cabinet Meeting : నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఇవాళ (బుధవారం) ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే, జమిలీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దసరా, దీపావళి పండగలు వస్తున్న నేపథ్యంలోనే.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటించే అవకాశం ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో జరుగుతున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
Read Also: Pawan Kalyan : కుమార్తెతో కలిసి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
అలాగే, హర్యానాలో హ్యాట్రిక్ విజయం తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్య విజయం అని పేర్కొన్నారు. హర్యానా రైతులు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నామని నిరూపించారు.. హర్యానాలో కమలం మూడో సారి కూడా వికసించిందన్నారు. ఇక, జమ్మూ కాశ్మీర్ ఎన్సీ- కాంగ్రెస్ కూటమికి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది.. బీజేపీకి మాత్రం గతం కంటే అధికంగా ఓట్లు లభించాయని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. కేబినెట్ భేటీలో రైతులు సహా యువతకు సంబంధించి కీలక నిర్ణయాలకు అవకాశముందని తెలుస్తొంది.