HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Centers Key Decision On Vande Mataram

వందేమాతరం పై కేంద్రం కీలక నిర్ణయం

  • Author : Vamsi Chowdary Korata Date : 11-02-2026 - 11:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Mataram
Vande Mataram
Vande Mataram వందేమాతరం గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ‘జనగణమన’ వంటి జాతీయ గీతాల కంటే ముందు దీనిని కచ్చితంగా ఆలపించాలని ఈ నిబంధనలలో పేర్కొంది. వందేమాతర గీతం ఆలపించినప్పుడు అందరూ నిలబడాలని పేర్కొంది.

అన్ని పురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని ఈ నిబంధనల్లో పేర్కొంది. జాతీయ గీతం, గేయం పాడుతుండగా అంతరాయం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. తాజాగా విడుదల చేసిన నిబంధనల కింద బాధ్యులకు గరిష్ఠంగా మూడేళ్ళ జైలు శిక్ష విధించనున్నట్లు స్పష్టం చేసింది. సినిమా హాల్స్ వంటి ప్రదేశాల్లో కూడా దీనిని తప్పనిసరి చేసింది. ఈ సందర్భాల్లో నిలబడటాన్ని తప్పనిసరి చేయలేదు.

కేంద్ర ప్రభుత్వం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త నిబంధనలను విడుదల చేసింది. 1937లో తొలగించిన నాలుగు చరణాలతో కలిపి మొత్తం ఆరు చరణాలను పాడాలని కేంద్రం వెల్లడించింది. స్వాతంత్ర పోరాట సమయంలో ముస్లిం లీగ్ అభ్యంతరాల మేరకు నాలుగు చరణాలను తొలగించిన కాంగ్రెస్, రెండు చరణాలను స్వీకరించింది. స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రభుత్వం రెండు చరణాలతోనే ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా ప్రకటించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central government
  • Home Ministry
  • Indian National Anthem
  • Jana Gana Mana
  • national anthem
  • Vande Mataram

Related News

Ban on Telegram app: Delhi High Court's key verdict

Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

నీట్‌ రీ-ఎగ్జామ్‌కు ముందు టెలిగ్రామ్‌ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పరిస్థితుల దృష్ట్యా కేంద్రం తీసుకున్న చర్య సమంజసమేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ‘‘అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో తప్పు కనిపించడం లేదు’’ అని పేర్కొంది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

  • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd