CBSE 10th Class Results : సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల.. 93.12% ఉత్తీర్ణత
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు రిలీజ్ అయిన కొద్ది సేపటికే.. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు (CBSE 10th Class Results) కూడా శుక్రవారం మధ్యాహ్నం విడుదల అయ్యాయి. వీటిలో 93.12% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మార్కులపరమైన అనారోగ్య పోటీని నివారించడానికి సీబీఎస్ఈ బోర్డ్ .. ఎటువంటి మెరిట్ జాబితాను ప్రకటించలేదు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఫస్ట్ , సెకండ్, థర్డ్ డివిజన్ లను కూడా కేటాయించలేదు.
- Author : Pasha
Date : 12-05-2023 - 2:05 IST
Published By : Hashtagu Telugu Desk
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు రిలీజ్ అయిన కొద్ది సేపటికే.. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు (CBSE 10th Class Results) కూడా శుక్రవారం మధ్యాహ్నం విడుదల అయ్యాయి. వీటిలో 93.12% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మార్కులపరమైన అనారోగ్య పోటీని నివారించడానికి సీబీఎస్ఈ బోర్డ్ .. ఎటువంటి మెరిట్ జాబితాను ప్రకటించలేదు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఫస్ట్ , సెకండ్, థర్డ్ డివిజన్ లను కూడా కేటాయించలేదు.
also read : CBSE Class 12 Results : సీబీఎస్ఈ 12వ తరగతి రిజల్ట్స్ రిలీజ్.. 87.33 శాతం ఉత్తీర్ణత
ఈ వెబ్ సైట్లలో రిజల్ట్..
results.cbse.nic.in, cbseresults.nic.in, cbse.nic.in, cbse.gov.in, digilocker.gov.in, results.gov.in, parikshasangam.cbse.gov.in వెబ్ సైట్లలో రిజల్ట్స్ ను విద్యార్థులు చూసుకోవచ్చు. ఈ వెబ్ సైట్లలోకి వెళ్లి మీ రోల్ నంబర్, పాఠశాల నంబర్, పుట్టిన తేదీ, అడ్మిట్ కార్డు ఐడీ నంబర్ లను నమోదు చేసి సబ్మిట్ చేయండి. దీంతో వెంటనే మీ ఎదుట CBSE బోర్డ్ 10వ తరగతి ఫలితం (CBSE 10th Class Results) ప్రత్యక్షం అవుతుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి. CBSE 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 10 వరకు జరిగాయి. 21.4 లక్షల మంది బాలికలు, 13.4 లక్షల మంది బాలురు సహా మొత్తం 34.8 లక్షల మంది విద్యార్థులు రాశారు.