Arvind Kejriwal Arrest: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సీబీఐ
తీహార్ జైలు నుండి కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సోమవారం విచారించి, ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
- By Praveen Aluthuru Published Date - 11:19 PM, Tue - 25 June 24

Arvind Kejriwal Arrest: తీహార్ జైలు నుండి కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సోమవారం విచారించి, ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. రేపు సంబంధిత ట్రయల్ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌ను హాజరుపరిచేందుకు సీబీఐకి అనుమతి లభించింది. ఈ మేరకు రేపు బుధవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరచనున్నారు.
అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నుతోందని ఆరోపించారు ఆప్ నేతలు. అరవింద్ కేజ్రీవాల్‌ను నకిలీ కేసులో అరెస్ట్ చేసేందుకు సీబీఐ కుట్ర పన్నుతోందన్నారు ఆప్ ఎంపీ సంజయ్. సీబీఐ అధికారులతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నింది. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ విచారణకు ముందే పెద్ద కుట్ర జరుగుతోంది. కేజ్రీవాల్‌కు బెయిల్ రాకుండా ఉండేందుకు సీబీఐతో బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ హైకోర్టు నుంచి షాక్ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించింది. విచారణ సందర్భంగ, హైకోర్టు రూస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ అసమంజసమైనదిగా పేర్కొంది. హైకోర్టు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఆప్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. నవంబర్ 17, 2021న కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. జూలై 2022లో అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించి నివేదిక సమర్పించారు. గోవా అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించిందని, ఇందులో కేజ్రీవాల్ ప్రధాన నిర్ణయాధికారంగా ఆరోపణలు ఉన్నాయి.
Also Read: Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ