Maharashtra elections : కులగణన తమకు కేంద్ర స్తంభం వంటిది : రాహుల్ గాంధీ
కులగణనే తమ ముందున్న అతిపెద్ద అంశమని, తాము దానిని పూర్తి చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కులగణన తమకు కేంద్ర స్తంభం వంటిదని రాహుల్ గాంధీ అన్నారు.
- By Latha Suma Published Date - 04:09 PM, Mon - 18 November 24

Rahul Gandhi : మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లారు. ప్రస్తుతం దేశంలో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తాము ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అంతేకాక.. దేశంలో కులగణన చేపడతామని అన్నారు. కులగణనే తమ ముందున్న అతిపెద్ద అంశమని, తాము దానిని పూర్తి చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కులగణన తమకు కేంద్ర స్తంభం వంటిదని రాహుల్ గాంధీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు రకాల భావజాలాలకు మధ్య జరుగుతున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. పేదలు, కొంత మంది కోటీశ్వరులకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు.
ముంబయిలోని ధారవి పునరాభివృద్ధి పథకంలో ఒక వ్యక్తికి సాయం చేయడానికి మొత్తం రాజకీయ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించారని రాహుల్ గాంధీ చెప్పారు. మోడీ, గౌతమ్ అదానీ కలిసి ఉన్నంత కాలం వారిద్దరూ సురక్షితంగానే ఉంటారని అన్నారు. ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్ సహా రూ.7 లక్షల కోట్ల ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించారని ఆయన అన్నారు. దీంతో మహారాష్ట్ర యువత ఉద్యోగాలు కోల్పోతుందని తెలిపారు. తమ మహా వికాస్ అఘాడీ మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Phone Tapping Case : హరీష్‌రావు నా ఫోన్ ట్యాప్ చేయించారు.. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్