Trainee IASs Mother: తుపాకీతో రైతులను బెదిరించిన ట్రైనీ ఐఏఎస్ తల్లి.. కేసు నమోదు
మహారాష్ట్రలో విధులు నిర్వర్తిస్తున్న 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మరిన్ని చిక్కుల్లో కూరుకుపోతున్నారు.
- By Pasha Published Date - 12:40 PM, Sat - 13 July 24

Trainee IASs Mother: మహారాష్ట్రలో విధులు నిర్వర్తిస్తున్న 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మరిన్ని చిక్కుల్లో కూరుకుపోతున్నారు. తాజాగా వైరల్ అయిన ఒక వీడియోతో ఆమె తల్లి కూడా వివాదంలో చిక్కుకున్నారు. రైతులను గన్‌తో బెదిరించిన ఘటనలో పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ, తండ్రి దిలీప్ ఖేడ్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 323, 504, 506, 143, 144, 147, 148, 149 సెక్షన్లతో పాటు ఆయుధ చట్టం కింద వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
వివరాల్లోకి వెళితే.. ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్(Trainee IASs Mother) తండ్రి దిలీప్ ఖేద్కర్ కూడా ప్రభుత్వ ఆఫీసర్‌గా పని చేశారు. ఈక్రమంలో పూణే తహసిల్‌లోని ధాడ్‌వాలీ గ్రామంలో ఆయన భూమిని కొన్నారు. అయితే ఆ భూమి పక్కనున్న ల్యాండ్‌ను కూడా దిలీప్ ఖేద్కర్ కుటుంబం కబ్జా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. కబ్జా చేసిన భూమి దగ్గరికి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ తన సెక్యూరిటీ గార్డులతో వెళ్లిందని అంటున్నారు. అక్కడికి వెళ్లి ఆ భూమి యజమాని కుల్దీప్ పసల్కర్‌కు తుపాకీని చూపెట్టి భయభ్రాంతులకు గురి చేశారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన 2 నిమిషాల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆధారంగానే ఆమెపై పోలీసులు కేసు పెట్టారు. మనోరమ దగ్గరున్న గన్‌కు లైసెన్సు ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read :Arikapudi Gandhi : కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
ఇక ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ కూడా తనకు వీఐపీ డిమాండ్లు కావాలని అధికారులను తరుచుగా అడిగేవారు. ప్రభుత్వ వర్గాల్లో ఉన్న పరిచయాలను వాడుకొని తనకు అదనపు సౌకర్యాలను కల్పించాలని తండ్రిపై ఆమె ఒత్తిడి తెచ్చేవారు. దీంతో తండ్రి దిలీప్ ఖేద్కర్.. కూతురి కోసం పూణే జిల్లా కలెక్టర్‌ను ప్రభావితం చేసేందుకు నానా ప్రయత్నాలు చేసేవారు. ట్రైనీ ఐఏఎస్‌లు ఎర్రబుగ్గ కారు వాడేందుకు అనుమతి లేదు. అయినా ఆమె తన కారుకు ఎర్రబుగ్గకారును వాడారు. యథేచ్ఛగా నిబంధనలను తుంగలో తొక్కి పూజా ఖేద్కర్ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఆమె క్రమశిక్షణా రహిత చర్యలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం కూడా ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలోనే దీని నివేదిక రానుంది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేసినందుకు పూజా ఖేద్కర్‌పై పోలీసులు రూ.27వేల జరిమానా వేశారు.