Delhi Court: బ్రిజ్ భూషణ్ శరణ్‌కు బెయిల్ మంజూరు
మహిళా రెజ్లర్లపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌కు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు నుంచి ఊరట లభించింది.
- By Praveen Aluthuru Published Date - 05:09 PM, Thu - 20 July 23

Delhi Court: మహిళా రెజ్లర్లపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌కు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు నుంచి ఊరట లభించింది. గురువారం ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. రూస్ అవెన్యూ కోర్టులో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ సింగ్, ప్రాసిక్యూషన్ మరియు ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతకుముందు బ్రిజ్ భూషణ్ సింగ్ బయటకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో అతని బెయిల్ ని వ్యతిరేకించారు. కానీ కోర్టు పోలీసుల వాదనను పరిగణలోకి తీసుకోలేదు. బ్రిజ్ భూషణ్ సహా ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి రూ.20,000 వ్యక్తిగత పూచీకత్తుపై జూలై 20 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు మధ్య బ్రిజ్ భూషణ్ ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ఈ రోజు వాదనలు విన్న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు గురువారం ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు బ్రిజ్ భూషణ్ తరపు న్యాయవాది రాజీవ్ మోహన్ కోర్టులో వాదిస్తూ ఈ కేసులో పోలీసులు విధించిన సెక్షన్లలో ఏదీ ఐదేళ్ల కంటే ఎక్కువ శిక్ష విధించే అవకాశం లేదని తెలిపారు.
ఒలింపిక్ విజేతలైన సాక్షి మాలిక్ మరియు బజరంగ్ పునియాతో పాటు రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత వినేష్ ఫోగట్‌తో సహా భారతదేశపు అగ్రశ్రేణి రెజ్లర్లు జనవరిలో బ్రిజ్ భూషణ్ శరణ్ పై లైంగిక ఆరోపణలు చేశారు.
Also Read: Baby : ప్రభాస్ ను క్రాస్ చేసిన బేబీ..మాములుగా లేదు కదా