HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bjps Saugat E Modi Eid Kits To Benefit 32 Lakh Muslims

Saugat e Modi : ముస్లింలకు మోడీ రంజాన్ తోఫా.. ‘సౌగత్-ఎ-మోడీ’ కిట్లు

బీజేపీ మైనారిటీ మోర్చాకు చెందిన ప్రతీ ఆఫీస్ బేరర్ మసీదు కమిటీల సహాయంతో ప్రతీ మసీదులో 100 మంది నిరుపేదలకు "సౌగత్-ఎ-మోడీ"(Saugat e Modi) కిట్లను అందజేస్తారని వెల్లడించారు.

  • Author : Pasha Date : 26-03-2025 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp Saugat E Modi Eid Kit Muslims Ramzan Pm Modi

Saugat e Modi : పవిత్ర రంజాన్ మాసం వేళ దేశంలోని ముస్లింలకు చేరువయ్యే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఇందుకోసం  “సౌగత్-ఎ-మోడీ” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ముస్లింలకు ఈద్ కిట్లను బీజేపీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన 32 లక్షల ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లను ఇవ్వాలని కమలదళం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బీజేపీకి చెందిన 32వేల మంది కార్యకర్తలను రంగంలోకి దింపింది. సౌగత్ అంటే బహుమతి అని అర్థం. “సౌగత్-ఎ-మోడీ” పేరుతో బీజేపీ తయారు చేయించిన ఈద్ కిట్లను, స్థానిక మసీదుల సహకారంతో నిర్వహించే కార్యక్రమాలు వేదికగా ముస్లింలకు పంపిణీ చేస్తారు. ఇప్పటికే ఈ తరహాలో ముంబైలో, ఢిల్లీలో ఈద్ కిట్లను అందజేశారు.

Also Read :Rajiv Yuva Vikasam: రూ.50వేల యూనిట్‌పై 100 శాతం రాయితీ.. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలివీ

ముంబై, ఢిల్లీలలో షురూ

ముంబైలోని నవీ ముంబై ఏరియాలో 200 మందికి సౌగత్ ఎ మోడీ కిట్లు అందాయి. ఢిల్లీలోని బస్తీ హజ్రత్ నిజాముద్దీన్‌లో ఉన్న గాలిబ్ అకాడమీ వేదికగా ఈ కిట్లను పంపిణీ చేశారు. “సౌగత్-ఎ-మోడీ” ఈద్ కిట్లలో ఆహార పదార్థాలు, దుస్తులు, సేమియా, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, చక్కెర ఉన్నాయి. ఇందులో మహిళలకు సల్వార్-సూట్ ఫాబ్రిక్, పురుషులకు కుర్తా-పైజామా ఫాబ్రిక్ ఉన్నాయి. ఒక కిట్ ధర దాదాపు రూ. 600 ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

పంపిణీ ప్రక్రియ ఇదీ.. 

బీజేపీ మైనారిటీ మోర్చాకు చెందిన ప్రతీ ఆఫీస్ బేరర్ మసీదు కమిటీల సహాయంతో ప్రతీ మసీదులో 100 మంది నిరుపేదలకు “సౌగత్-ఎ-మోడీ”(Saugat e Modi) కిట్లను అందజేస్తారని వెల్లడించారు. సమాజంలోని ముస్లిం వర్గంలో బీజేపీని విస్తరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్‌కు చెందిన మౌలానా సాజిద్ రషీది ప్రశంసించారు. ‘‘ఇది బీజేపీ పట్ల ముస్లింల అవగాహనను మార్చడానికి, బుజ్జగింపు రాజకీయాలకు దూరంగా ఉండటానికి సహాయపడుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

టార్గెట్ బిహార్ ఎలక్షన్స్ 

బిహార్‌‌లో ముస్లిం జనాభా ఎక్కువ. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని పలు ముస్లిం సంఘాలు  బీజేపీకి సన్నిహితుడైన సీఎం నితీశ్ కుమార్ ఇఫ్తార్ విందులను బహిష్కరించారు. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.  ఈ తరుణంలో ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకే “సౌగత్-ఎ-మోడీ” కిట్ల పంపిణీని బీజేపీ మొదలుపెట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.  ‘‘బిహార్‌లో 17 శాతం మంది ముస్లింలు ఉన్నారు. కొన్ని జిల్లాలో వారి ప్రభావం చాలా ఎక్కువ. ముస్లింల ఓట్ల కోసమే బీజేపీ సౌగత్‌ కిట్లను తీసుకొచ్చింది. బిహార్‌కు నిజంగా సౌగత్‌ (బహుమతి) ఇవ్వాలనుకుంటే తొలుత వలసలు నివారించండి. ఉద్యోగాలను కల్పించండి’’ అని కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ రంజన్‌ విమర్శించారు. ‘‘ఇది బీజేపీ కపటబుద్ధికి నిదర్శనం. వారు చేసేదంతా మంచి, ఇతరులు చేసేదంతా చెడు అన్న రీతిలో వ్యవహరిస్తోంది’’ అని పేర్కొంటూ శివసేన (థాక్రే) యువనేత ఆదిత్య థాక్రే  సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

Also Read :BYD Car Plant : హైదరాబాద్‌‌కు మెగా ప్రాజెక్ట్.. భారీ పెట్టుబడితో బీవైడీ కార్ల ప్లాంట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Eid Kit
  • muslims
  • pm modi
  • ramzan
  • Saugat e Modi

Related News

PM Modi Becomes Most-Followed World Leader With Over 30 Million Subscribers

యూట్యూబ్‌లోనూ ప్రధాని మోదీ రికార్డు

Narendra Modi  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో ఆయన చానెల్ 3 కోట్ల (30 మిలియన్ల) సబ్‌స్క్రైబర్ల మైలురాయిని దాటింది. దీంతో ప్రపంచంలోని ప్రస్తుత, మాజీ దేశాధినేతల్లో యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన నేతగా ఆయన తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఈ ఘనతతో డిజిటల్ కమ్యూనికేషన్‌ల

  • Netanyahu Modi Phone Call

    ఇజ్రాయెల్‌కు అండగా నిలబడ్డందుకు మోదీకి థాంక్స్

  • PM Modi

    ఎన్‌సీఈఆర్‌టీ వివాదం.. ప్ర‌ధాని మోదీ అస‌హ‌నం!

  • PM Modi

    Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్

Latest News

  • Blenders Pride : బ్లెండర్స్ ప్రైడ్ నుండి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్

  • Escorts Kubota Limited : దక్షిణాది రైతుల కోసం ఎస్కార్ట్స్ కుబోటా సరికొత్త ట్రాక్టర్ విడుదల

  • సోషల్ మీడియా క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

  • Mini Maldives : తెలంగాణలో మినీ మాల్దీవులు ఉన్నాయని మీకు తెలుసా ?

  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.. చైనా వార్నింగ్ !

Trending News

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd