HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bjp Releases Manifesto For Karnataka Elections 2023

Karnataka Elections: కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన నడ్డా

కర్ణాటకలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి

  • By Praveen Aluthuru Published Date - 12:48 PM, Mon - 1 May 23
  • daily-hunt
Karnataka Elections:
New Web Story Copy (58)

Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోను ఈ రోజు విడుదల చేసింది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం బీజేపీ మేనిఫెస్టోలో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా సిలిండర్లు ఇస్తామని పార్టీ ప్రకటించింది. బీజేపీ మేనిఫెస్టో ‘విజన్ డాక్యుమెంట్’ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు బెంగళూరులో విడుదల చేశారు. మేనిఫెస్టోను విడుదల చేస్తూ నడ్డా మాట్లాడుతూ.. ఈ మేనిఫెస్టో ఏసీలో కూర్చుని తయారు చేయలేదని, రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని సందర్శించి లక్షలాది మంది ప్రజల సూచనలు సలహాలు తీసుకుని మేనిఫెస్టో రూపొందించామని నడ్డా అన్నారు.

బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు*

  • కర్ణాటకలో యూనిఫాం సివిల్ కోడ్‌ను బీజేపీ తీసుకురానుంది
  • బిపిఎల్ కుటుంబాలకు 3 ఉచిత సిలిండర్లు, రోజుకు అరలీటర్ పాలు ఇస్తామని హామీ ఇచ్చారు
  • అటల్ డైట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా తక్కువ ధరకే ఆహారం అందిస్తామని ప్రకటించారు.
  • ఉమ్మడి పౌర స్మృతి అమలు
  • రైతులకు రూ.5 లక్షల వరకు సున్నా వడ్డీకే రుణాలు
  • కర్ణాటకలో ఎన్ఆర్‌సీ (జాతీయ పౌరుల రిజిస్టర్) అమలు
  • రాడికలైజేషన్‌కు వ్యతిరేకంగా పోరాటం
  • ఛాందసవాదానికి వ్యతిరేకంగా ప్రత్యేక విభాగం ఏర్పాటు
  • బెంగళూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
  • బెంగళూరులోని అపార్ట్‌మెంట్‌వాసులు ఆనందంగా జీవించడం కోసం ప్రత్యేక పథకం
  • కర్ణాటక అపార్ట్‌మెంట్ ఓనర్‌షిప్ యాక్ట్, 1972 సవరణ, కర్ణాటక రెసిడెంట్స్ వెల్ఫేర్ కన్సల్టేటివ్ కమిటీ ఏర్పాటు
  • పోషణ పథకం క్రింద నిరుపేద కుటుంబాలకు ప్రతి రోజూ ఉచితంగా అర లీటరు చొప్పున నందిని పాల పంపిణీ
  • ప్రతి నెలా రేషన్ కిట్స్.. 5 కేజీల శ్రీ అన్న-సిరి ధాన్య పంపిణీ
  • చట్టవిరుద్ధ వలసదారులను పంపించేయడం
  • ప్రతి పురపాలక సంఘంలోని ప్రతి వార్డులోనూ అటల్ ఆహార కేంద్రాల ఏర్పాటు, నాణ్యమైన, ఆరోగ్యకరమైన, సరసమైన ధరల్లో ఆహారాన్ని అందుబాటులో ఉంచడం
  • ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం కోసం ప్రముఖులతో భాగస్వామ్యం.
  • ప్రతిభావంతులైన యువ ప్రొఫెషనల్స్‌కు ప్రోత్సాహం. ‘సమన్వయ’ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు, ఐటీఐల మధ్య సహకారాన్ని పెంపొందించడం
  • ఐఏఎస్, కేఏఎస్, బ్యాంకింగ్, ప్రభుత్వోద్యోగాలకు శిక్షణ పొందే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం
  • మిషన్ స్వాస్థ్య కర్ణాటక’ పథకం ద్వారా ప్రజారోగ్య మౌలిక సదుపాయాల బలోపేతం
  • పురపాలక సంఘాల్లో ప్రతి వార్డులో నమ్మ క్లినిక్‌ల ఏర్పాటు
  • సీనియర్ సిటిజన్లకు ఉచితంగా ప్రతి సంవత్సరం మాస్టర్ హెల్త్ చెక్-అప్స్టేట్ కేపిటల్ రీజియన్’గా రాబోయే తరాల కోసం బెంగళూరు అభివృద్ధి
  • ఎలక్ట్రిక్ వాహనాల ప్రీమియర్ హబ్‌గా కర్ణాటక అభివృద్ధి
  • రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, 1,000 స్టార్టప్ కంపెనీలకు మద్దతు, బీఎంటీసీ బస్సులను పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం
  • బెంగళూరు శివారులో ‘ఈవీ సిటీ’ నిర్మాణం
  • ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, ఏపీఎంసీల ఆధునికీకరణ, డిజిటైజేషన్, మైక్రో కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు కోసం రూ.30 వేల కోట్లతో కే-అగ్రి ఫండ్ ఏర్పాటు.
  • నూతనంగా 5 ఆగ్రో-ఇండస్ట్రీ క్లస్టర్స్ ఏర్పాటు, కొత్తగా మూడు ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటు
  • కర్ణాటకను అత్యంత ఆకర్షణీయమైన టూరిస్ట్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు రూ.1500 కోట్లు కేటాయింపు
  • కల్యాణ సర్క్యూట్, బనవాసి సర్క్యూట్, పరశురామ సర్క్యూట్, కావేరీ సర్క్యూట్, గాణగాపుర కారిడార్‌ల అభివృద్ధి
  • ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం విస్తరణ
  • బియాండ్ బెంగళూరు’లో 10 లక్షల మాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగాల సృష్టి
  • ఇళ్లు లేని నిరుపేదల కోసం 10 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ
  • ఒనకే ఒబవ్వ సామాజిక న్యాయ నిధి’ పథకం క్రింద ఎస్సీ, ఎస్టీ మహిళలు ఐదేళ్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, దానికి అదనంగా మ్యాచింగ్ డిపాజిట్ రూ.10,000 ప్రభుత్వం చేస్తుంది.

Read More: Bhola Shankar Look: ట్యాక్సీ డ్రైవర్ గా చిరంజీవి.. వింటేజ్ లుక్స్ అదుర్స్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 elections
  • BJP Manifesto
  • JP Nadda
  • karnataka polls
  • manifesto

Related News

    Latest News

    • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

    • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

    • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd