BJP : మణిపూర్‌లో బీజేపీ నాయకుడిపై కాల్పులు..పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు
మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో బీజేపీ నాయకుడిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీజేపీ నాయకుడు మృతి చెందాడు.
- By Prasad Published Date - 07:19 AM, Wed - 25 January 23

మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో బీజేపీ నాయకుడిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీజేపీ నాయకుడు మృతి చెందాడు. కాల్పుల తర్వాత ప్రధాన నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ కేసులో మరొక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ రాష్ట్ర మాజీ సైనికోద్యోగుల విభాగం కన్వీనర్ లైష్రామ్ రామేశ్వర్ సింగ్.. క్షేత్ర లైకై ప్రాంతంలోని ఆయన నివాసం గేట్ల దగ్గర ఉదయం హత్యకు గురయ్యారని తౌబల్ ఎస్పీ హౌబిజం జోగేశ్‌చంద్ర తెలిపారు.రిజిస్ట్రేషన్ నంబర్ లేని కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉదయం 11 గంటల సమయంలో సింగ్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారని చెప్పారు. రామేశ్వర్ సింగ్ ఛాతిపై బుల్లెట్ గాయమైంది. వెంటనే బాధితుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ రామేశ్వర్ సింగ్ మరణించాడు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత వాహనం నడుపుతున్న నౌరెమ్ రికీ పాయింటింగ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు జోగేశ్‌చంద్ర తెలిపారు. బిష్ణుపూర్ జిల్లాలోని కీనౌకు చెందిన డ్రైవర్‌ను ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని హౌబామ్ మరాక్ ప్రాంతంలో పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు అయెక్‌పామ్ కేశోర్జిత్‌గా పోలీసులు గుర్తించారు

Related News

America : అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు.. ఒక్క నెలలో ఆరు సార్లు..!
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన