HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Becoming Chief Minister Is Not My Dream Cm Rekha Gupta

Rekha Gupta : ముఖ్యమంత్రిని కావడం నా కల కాదు: సీఎం రేఖా గుప్తా

ముఖ్యమంత్రిని కావడం తన కల కాదు. కానీ ఈ పదవి లాటరీ కాదు అని చెప్పారు. మహిళలకు గుర్తింపు ఇవ్వాలనే సిద్ధాంతంతో ప్రధాని మోడీ పార్టీ నేతలు తనను సీఎంగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

  • Author : Latha Suma Date : 07-03-2025 - 2:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Becoming Chief Minister is not my dream: CM Rekha Gupta
Becoming Chief Minister is not my dream: CM Rekha Gupta

Rekha Gupta : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇటీవల మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఉర్దూ కవి రహత్ ఇందోరి రాసిన షాయరీని ప్రస్తావిస్తూ.. “నేను కొమ్మల నుంచి రాలిపోయే ఆకును కాను.. ఎవరైనా ఆ తుపానుకు కాస్త చెప్పండి.. అదుపులో ఉండమని” అన్నారు. అత్యున్నత స్థాయి పదవి దక్కినప్పుడు తాను బాలీవుడ్‌ సినిమా ‘నాయక్‌’ లోని హీరోయిన్‌లా ఫీలయ్యానని ఆమె చెప్పారు.

Read Also: RED BOOK : ప్రకంపనలు – కొడాలి నాని అనుచరులకు పోలీసుల నోటీసులు

రేఖా గుప్తా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని కావడం తన కల కాదు. కానీ ఈ పదవి లాటరీ కాదు అని చెప్పారు. మహిళలకు గుర్తింపు ఇవ్వాలనే సిద్ధాంతంతో ప్రధాని మోడీ పార్టీ నేతలు తనను సీఎంగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాల పాలనలోని లోపాలను సరిదిద్దేందుకు, అవినీతిని పారదోలేందుకు కట్టుబడి ఉన్నామని రేఖా గుప్తా వెల్లడించారు.

బీజేపీ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదంటూ ఢిల్లీ మాజీ సీఎం ఆతిశీ చేసిన విమర్శలను రేఖా గుప్తా తిప్పికొట్టారు. కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్‌ 13 ఏళ్లు ఢిల్లీని పాలించాయి. ఇన్నేళ్లపాటు మీరేం చేశారో చూసుకోకుండా.. అధికారంలోకి వచ్చి ఒక్కరోజు కూడా కానీ మాపై విమర్శలు చేస్తారా..? అని దీటుగా బదులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల విజయంతో రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా నియమితులయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు ఈ అవకాశం దక్కింది. సీఎంగా ఎన్నికైన వెంటనే ఆప్‌ విమర్శలు చేయడంతో ఆమె దీటుగా బదులిచ్చిన విషయం తెలిసిందే.

కాగా, రేఖా గుప్తా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శాలిమార్‌ బాగ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను 48 స్థానాల్లో గెలిచిన బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో బీజేపీ హైకమాండ్‌ చట్టసభల్లో ఏమాత్రం అనుభవం లేని రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా నియమించింది.

Read Also: Nara Lokesh : త్వరలోనే టీచర్ల బదిలీల కోసం ప్రత్యేక చట్టం : మంత్రి లోకేశ్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • delhi cm
  • Rahat Indori
  • Rekha Gupta
  • Shayari

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Kerala Ex Cm

    Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • Chikkamagaluru Farmers

    Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd