Bank holidays in September: సెప్టెంబరు నెలలో 16 రోజులపాటు బ్యాంకులు బంద్.. లిస్ట్ ఇదే..!
దేశంలో పండుగల పర్వం మొదలైంది. రాబోయే నెలల్లో, ఈ నెలలోనే ప్రారంభమయ్యే అనేక పెద్ద పండుగలు ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో వచ్చే నెల 16 రోజుల పాటు బ్యాంకులు (Bank holidays in September) మూసివేయబడతాయి.
- By Gopichand Published Date - 08:21 AM, Sun - 27 August 23
Bank holidays in September: దేశంలో పండుగల పర్వం మొదలైంది. రాబోయే నెలల్లో, ఈ నెలలోనే ప్రారంభమయ్యే అనేక పెద్ద పండుగలు ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయి. ఇది బ్యాంకుల పనితీరుపై ప్రభావం చూపుతుంది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. దేశంలోని వివిధ ప్రాంతాలలో వచ్చే నెల 16 రోజుల పాటు బ్యాంకులు (Bank holidays in September) మూసివేయబడతాయి. అంటే ప్రతి రోజూ ఏదో ఒక చోట బ్యాంకులకు సెలవులు ఉండనుంది.
ఈ విధంగా సెలవులు నిర్ణయించబడతాయి
బ్యాంకు సెలవులు రెండు విధాలుగా నిర్ణయించబడతాయి. జాతీయ సెలవుల సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడి ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఆదివారం, రెండవ, నాల్గవ శనివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. ఇవి కాకుండా ప్రాంతీయ పండుగల ప్రకారం.. వివిధ ప్రదేశాలలో వేర్వేరు రోజులలో బ్యాంకులు మూసివేయబడతాయి. సెప్టెంబరు నెలలో బ్యాంకులకు ఏయే రోజులు సెలవులు ఉండబోతున్నాయో చూద్దాం.
Also Read: Chandrayaan-3 Success: చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రోపై పాకిస్థాన్ ప్రశంసల జల్లు..!
సెప్టెంబర్ నెలలో బ్యాంకుల సెలవు రోజులు
సెప్టెంబర్ 3, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 6, 2023- శ్రీ కృష్ణ జన్మాష్టమి కారణంగా భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పట్నాలో బ్యాంకులు పని చేయవు.
సెప్టెంబర్ 7, 2023- శ్రీ కృష్ణ జన్మాష్టమి కారణంగా అహ్మదాబాద్, చండీగఢ్, డెహ్రాడూన్, గాంగ్టక్, తెలంగాణ, జైపూర్, జమ్ము, కాన్పూర్, లఖ్‌నవూ, రాయ్‌పుర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 9, 2023- రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 10, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 17, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 18, 2023- వినాయక చవితి కారణంగా తెలంగాణ, బెంగళూరులో బ్యాంకులు పని చేయవు.
సెప్టెంబర్ 19, 2023- గణేష్ చతుర్థి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, భువనేశ్వర్, ముంబై, నాగ్‌పూర్, పనాజీలలో బ్యాంకులను మూసివేస్తారు.
సెప్టెంబర్ 20, 2023- గణేష్ చతుర్థి, నుఖాయ్ కారణంగా కోచి, భువనేశ్వర్‌లో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 22, 2023- శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా కోచి, పనాజీ, త్రివేండ్రంలో బ్యాంకులు పని చేయవు.
సెప్టెంబర్ 23, 2023 – నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 24, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 25, 2023- శ్రీమంత్ శంకర్‌దేవ్ జన్మదినం కారణంగా గువాహటిలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 27, 2023- మిలాద్-ఎ-షరీఫ్ కారణంగా జమ్ము, కోచి, శ్రీనగర్, త్రివేండ్రంలో బ్యాంకులను మూసివేస్తారు.
సెప్టెంబర్ 28, 2023- ఈద్-ఇ-మిలాద్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
సెప్టెంబర్ 29, 2023- ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ కారణంగా గాంగ్టక్, జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులను మూసివేస్తారు.
Related News
ATM Fraud: ఏటీఎం కార్డ్ ట్రాప్ స్కామ్ అంటే ఏమిటి? సైబర్ మోసగాళ్ల కొత్త రూట్ ఇదే..!
ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తుండగా మరోవైపు భద్రతా ఉల్లంఘన ప్రమాదం కూడా ఉంది.