Indian Idol 13 Winner: ఇండియన్ ఐడల్ 13 విన్నర్ గా ఆయోధ్య కుర్రాడు రిషి సింగ్.. బహుమతి ఎంతో తెలుసా?
ప్రముఖ సోనీ చానల్ నిర్వహించిన సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 13వ సీజన్ లో ఉత్తరప్రదేశ్ అయోధ్య నగరానికి చెందిన రిషి సింగ్ విజేతగా నిలిచాడు.
- By Maheswara Rao Nadella Published Date - 11:28 AM, Mon - 3 April 23

Indian Idol 13 Winner : ప్రముఖ సోనీ చానల్ నిర్వహించిన సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 13వ (Indian Idol 13) సీజన్ లో ఉత్తరప్రదేశ్ అయోధ్య నగరానికి చెందిన రిషి సింగ్ విజేతగా నిలిచాడు. ఆదివారం అర్ధరాత్రి ముంబైలో జరిగిన కార్యక్రమంలో రిషి సింగ్ రూ.25లక్షల చెక్కు, మారుతి సుజుకి బ్రీజా కారును ప్రధమ బహుమతిగా అందుకున్నాడు. కోల్ కతాకు దేబాస్మితా రాయ్ తొలి రన్నరప్ గా నిలవగా, జమ్మూకశ్మీర్ సింగర్ చిరాగ్ కొత్వాల్ రెండవ రన్నరప్‌గా నిలిచాడు. వీరికి చెరో 5 లక్షల నగదు బహుమతి లభించింది.
గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ కు సోనాక్షి కర్, శివమ్ సింగ్, బిదీప్త చక్రవర్తి చేరారు. హిమేష్, విశాల్ దద్లానీ, నేహా కక్కర్ న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు . టాప్ 6 పోటీదారులతో గట్టి పోటీని తట్టుకొని రిషి సింగ్ తన గాత్రంతో అందరిని మెప్పించాడు. అనాథ అయిన రిషి తన జీవితం గురించి వివరించాడు. తన తల్లిదండ్రులు తనను దత్తత తీసుకోకుంటే తాను మరణించి ఉండేవాడినని రిషి ఎమోషనల్ గా చెప్పాడు.
Also Read: Sujana entry into TDP?: టీడీపీలోకి సుజనా ఎంట్రీ? సీనియర్లలో ఆందోళన!