HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Sujana Entry Into Tdp Anxiety Among Seniors

Sujana entry into TDP?: టీడీపీలోకి సుజనా ఎంట్రీ? సీనియర్లలో ఆందోళన!

ఎన్నికల వేళ మళ్ళీ పాత కాపులు చంద్రబాబు చుట్టూ చేరుతున్నారు. ప్రజలతో నేరుగా సంబంధం లేని సుజనా చౌదరి, మాజీ మంత్రి నారాయణ, నాలుగు ఏళ్లుగా దూరంగా ఉన్న..

  • By CS Rao Published Date - 11:00 AM, Mon - 3 April 23
  • daily-hunt
Sujana's Entry Into Tdp.. Anxiety Among Seniors!
Sujana's Entry Into Tdp.. Anxiety Among Seniors!

Sujana Chowdary entry into TDP? :

ఎన్నికల వేళ మళ్ళీ పాత కాపులు చంద్రబాబు చుట్టూ చేరుతున్నారు. ప్రజలతో నేరుగా సంబంధం లేని సుజనా చౌదరి (Sujana Chowdary), మాజీ మంత్రి నారాయణ, నాలుగు ఏళ్లుగా దూరంగా ఉన్న మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు సీన్లోకి వస్తున్నారు. అధికారపక్షంతో పోరాడిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సైలెంట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమ తదితరులు వెనక్కు వెళ్లిపోతున్నారు. మళ్ళీ సుజనా చౌదరి (Sujana Chowdary) తన టీంను యాక్టివ్ చేస్తున్నారు. పార్టీ కి ఆర్థిక వనరుగా ఎంటర్ అయిన ఆయన తెలుగుదేశం పార్టీ ని హోల్సేల్ గా రాజసభలో అమ్మేశారు. బీ జే పీ లో టీడీపీ ని విజవంతంగా విలీనం చేసిన ఆర్థిక వేత్త. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం అంటూ అమరావతి అంశాన్ని తీసుకొని గుంటూరు కేంద్రంగా మీటింగ్ పెట్టారు. ఒక బీజేపీ లీడర్ తో టీడీపీ లీడర్లు మీటింగ్ పెట్టటం పెద్ద చర్చకు దారితీస్తుంది. అంటే ఇప్పటివరకు ఉన్న ముసుగు తొలగింది అనే సంకేతం బలంగా వెళ్ళింది. ఈ పరిణామం టీడీపీ కి క్షేత్ర స్థాయిలో ఇబ్బంది పెట్టే అంశంగా ఆ పార్టీలోని కొందరు ఆందోళన చెందుతున్నారు.

బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు సుజన చౌదరి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇంటికి ఆదివారం వెళ్లారు. ఈ సమావేశంలో టీడీపీ మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీ నారాయణతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో ఇటీవలే బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ కారుపై జరిగిన దాడిపై చర్చించారు.సత్యకుమార్‌పై జరిగిన దాడి ఘటనపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి సహకరించాలని సుజనా చౌదరి (Sujana Chowdary) టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ నాయకులే సత్యకుమార్పై దాడి చేశారని, దీన్ని ఉమ్మడిగా ఎదిరించాల్సిన అవసరం ఉందని కోరారట. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తోన్న నిరసన దీక్షలకు బీజేపీ మద్దతు పలుకుతుంది.మద్దతును వైసీపీ సహించలేకపోతోందని, అందుకే గుండాలతో సత్యకుమార్‌పై దాడి చేయించిందని ఆరోపించారు. కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేయడం సిగ్గుచేటని, ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని, ఈ ఓటును చీలనివ్వకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఎన్నికలకు వెళ్లాలని కోరారు.

ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం అంటూ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. పొత్తుల విషయంలో బీజేపీ అధిష్ఠానం ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలను పంపించలేదు. కానీ సుజనా ఎంట్రీ రాజకీయాల సమీకరణాలు మారుతున్నట్టే కనిపిస్తోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- పొత్తుల దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడును అడ్డుకోవడానికి 2014 తరహాలో తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ-జనసేన, ఇతర పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడాలని సుజనా కోరిక. కానీ బీజేపీ అధిష్టానం అందుకు సిద్ధంగా లేదు. అందుకే టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సుజనా అడుగులు వేగంగా పడుతున్నాయి. గమనిస్తున్న బీజేపీ అధిష్టానం సుజనాకు సరైన జలక్ ఇవ్వడానికి సిద్ధం అయిందని తెలుస్తుంది. ఇలాంటి పరిణామం ఆర్థికంగా టీడీపీ కి లభించే అవకాశం ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో సుజనా వలన పార్టీ మీద చెడు ప్రభావం ప్రభావం పడనుందని క్యాడర్ ఆందోళన.

Also Read:  KTR on AP: ఏపీ పై కేటీఆర్ కన్ను, విశాఖ స్టీల్, గన్నవరం పోర్ట్ టార్గెట్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anxiety
  • Political Affairs
  • political entry
  • Senior Leaders
  • sujana chowdary
  • tdp

Related News

Lokesh's satire on Jagan

Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

సోషల్‌ మీడియా వేదికగా లోకేశ్‌ స్పందిస్తూ, "ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు వింటాం గానీ... తన సొంత నియోజకవర్గంలో, తన పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులా? ఇదేం కొత్త రీతీ, చూడలేదుగా!" అంటూ జగన్‌ చర్యలపై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. రాజకీయ వర్గాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు విస్తృత చర్చలకు దారితీశాయి.

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd