1975 Emergency Pension :ఎమర్జెన్సీని ఎదిరించిన యోధులకు నెలకు రూ.15వేల పింఛను
1975 Emergency Pension : స్వాతంత్ర్య సమర యోధులకు ఇచ్చే పెన్షన్ ను ‘ఎమర్జెన్సీ’ని ఎదిరించిన యోధులకు కూడా ఇస్తామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.
- Author : Pasha
Date : 26-06-2023 - 6:53 IST
Published By : Hashtagu Telugu Desk
1975 Emergency Pension : స్వాతంత్ర్య సమర యోధులకు ఇచ్చే పెన్షన్ ను ‘ఎమర్జెన్సీ’ని ఎదిరించిన యోధులకు కూడా ఇస్తామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీతో దేశంలో ప్రజల హక్కులకు విఘాతం కలిగిందని విమర్శించిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ.. నాటి అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ప్రతిఘటించిన యోధులకు నెలవారీ పింఛను(1975 Emergency Pension) ఇస్తానని ప్రకటించారు.
Also read : Patnam Mahendar Reddy : బెడిసికొట్టిన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వ్యూహం
300 మంది ‘లోక్ తంత్ర సేనాని’లను గుర్తించామని, వారికి నెలకు రూ.15,000 పింఛను ఇస్తామని సీఎం వెల్లడించారు. యోధులు మరణిస్తే వారి భార్యకు లేదా పెళ్లికాని కుమార్తెలకు పింఛను వర్తింప చేస్తామన్నారు.ఎమర్జెన్సీ రోజుల్లో 15 రోజులకు పైగా జైలు జీవితం గడిపిన వారిని ఈ పింఛనుకు ఎంపిక చేశామన్నారు. ఎమర్జెన్సీ ఆర్డర్ పై సంతకం చేసిన నాటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్.. అస్సామీ అని, నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేబకాంత బారువా కూడా అస్సామీయే కావడం బాధాకరమని హిమంత శర్మ కామెంట్ చేశారు.