Social Media : ” రీల్స్ మానేయ్యండి..న్యూస్‌పేపర్లు చదవండి” యువతకు అసదుద్దీన్ ఓవైసీ కీలక సూచనలు
Social Media : “మీరు రీల్స్‌లో మునిగిపోతే, బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) మీ ఇంటికి వచ్చి ప్రశ్నిస్తే, మీరు ఏం సమాధానం చెప్పగలరు?” అని ప్రశ్నించారు
- By Sudheer Published Date - 10:34 AM, Wed - 16 July 25

AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) యువతకు కీలక సూచనలు చేశారు. స్మార్ట్‌ఫోన్‌లో సమయం అంతా రీల్స్ చూస్తూ గడపడం, సోషల్ మీడియా (Social Media) బానిసలవడం వల్ల మెదడు నాశనం అవుతోందని, భవిష్యత్తు దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. “న్యూస్‌పేపర్లు చదవండి, రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేయకండి” అని ఓవైసీ హితవు పలికారు. “నాయకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు కావాలంటే రీల్స్‌కు దూరంగా ఉండాలి” అని ఆయన యువతకు సూచించారు.
CM Revanth : విమానంలో సాధారణ ప్రయాణికుడిలా సీఎం రేవంత్
బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్ల జాబితాలను పునఃసమీక్షిస్తున్న నేపథ్యంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. “మీరు రీల్స్‌లో మునిగిపోతే, బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) మీ ఇంటికి వచ్చి ప్రశ్నిస్తే, మీరు ఏం సమాధానం చెప్పగలరు?” అని ప్రశ్నించారు. అనేక మంది ప్రజలను “బాంగ్లాదేశీ”, “నేపాళీ”, “మయన్మార్ వాల్లు”గా లేబుల్ చేయడం పై ఓవైసీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా విమర్శించారు. “ఒకరి పౌరసత్వాన్ని నిర్ణయించాల్సిన అధికారం ECIకి ఎవరిచ్చారు?” అని ప్రశ్నించారు.
“మా పార్టీ మొదటగా ఈ SIR ప్రక్రియను ‘బ్యాక్‌డోర్ NRC’గా అభివర్ణించింది” అంటే పౌరసత్వాన్ని సమీక్షించడానికీ, అనుమానితులుగా గుర్తించడానికీ ఈ ప్రక్రియను వినియోగిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 2003లో జరిగిన ఇదే తరహా ప్రక్రియలో ఎంతమంది విదేశీయులను గుర్తించారో ప్రభుత్వం వెల్లడించాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఈసారి BLOల సంఖ్య ఎంత? వాళ్లు ఎక్కడ ఉన్నారు? ఎవరు బాంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ వాసులని చెబుతున్నారు అనే వివరాలను AIMIM కార్యకర్తలు తెలుసుకునేందుకు ప్రయత్నించనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 86.32% ఫారాల సేకరణ పూర్తయినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.