BJP leader : మహిళా కార్యకర్తతో మరో బీజేపీ నేత రాసలీలలు..!
విడియోల ద్వారా బయటపడిన అమరీ కిషోర్ ప్రవర్తన పార్టీ ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధమని భావించిన బీజేపీ అధిష్ఠానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. పార్టీ శిష్టాచార కమిటీ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.
- By Latha Suma Published Date - 11:57 AM, Mon - 26 May 25

BJP leader : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మళ్లీ రాజకీయ సంచలనానికి వేదికైంది. గూండా జిల్లాలో బీజేపీకి చెందిన ప్రముఖ నేత, జిల్లా అధ్యక్షుడు అమరి కిషోర్ మహిళా కార్యకర్తలతో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన గత నెల 12వ తేదీన జరిగి, తాజాగా సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీకి చెడ్డపేరు రాగలదనే భయంతో బీజేపీ హుటాహుటిన చర్యలకు దిగింది. విడియోల ద్వారా బయటపడిన అమరీ కిషోర్ ప్రవర్తన పార్టీ ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధమని భావించిన బీజేపీ అధిష్ఠానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. పార్టీ శిష్టాచార కమిటీ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. బీజేపీ నేతలపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన ప్రతి సారి పార్టీ ఆచరణలో ఉండే నైతిక ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.
మహిళా కార్యకర్తతో మరో బీజేపీ నేత రాసలీలలు.. నోటీసులు జారీ యూపీలోని గోండా జిల్లాలో మహిళా కార్యకర్తతో రాసలీలలు చేసిన బీజేపీ అధ్యక్షుడు అమరి కిషోర్ ఈ ఘటన గత నెల 12న జరగగా వీడియో వైరలవ్వడంతో అతడికి నోటీసులు ఇచ్చిన బీజేపీ పార్టీ #UttarPradesh #BJP #HashtagU pic.twitter.com/LcMLnXeopd
— Hashtag U (@HashtaguIn) May 26, 2025
Read Also: Corona cases : ఏపీలో బహిరంగ సభలు, ర్యాలీలపై బ్యాన్.. !
అమరి కిషోర్ పై వచ్చిన ఆరోపణలు కేవలం వ్యక్తిగతంగా కాకుండా, పార్టీపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మహిళా కార్యకర్తల అభద్రత, నాయకత్వంపై విశ్వాసం వంటి అంశాలు మరింతగా చర్చనీయాంశంగా మారాయి. గతంలో కూడా బీజేపీకి చెందిన కొంతమంది నేతలపై ఇటువంటి వివాదాస్పద ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి ఘటన స్పష్టమైన వీడియో ఆధారాలతో బయటపడటంతో, పరిస్థితిని తేలికగా తీసుకోవడం సాధ్యం కాలేదు. పార్టీపై భారం పడకుండా, చర్యలు తీసుకుంటున్నామని బీజేపీ రాష్ట్ర విభాగం స్పష్టం చేసింది. ‘‘ఎలాంటి అనైతిక కార్యకలాపాలనూ మేము సహించము. పార్టీ గౌరవాన్ని కాపాడడంలో రాజీ పడము. ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఆయనను అన్ని బాధ్యతల నుంచి తాత్కాలికంగా విముక్తి కల్పించాం,’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇక, సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై విస్తృతంగా చర్చ సాగుతుంది. చాలామంది ఈ వ్యవహారాన్ని ఉదాహరణగా చూపిస్తూ, రాజకీయాల్లో మహిళలకు ఎదురయ్యే అవమానాలను చర్చిస్తున్నారు. మహిళా సంఘాలు కూడా ఈ విషయంపై స్పందిస్తూ, పూర్తి విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు పార్టీల మానవతా విలువలపై, రాజకీయ నాయకుల ప్రవర్తన ప్రమాణాలపై ప్రశ్నలు వేస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఈ వివాదాన్ని అదుపులోకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ప్రజల విశ్వాసాన్ని పునఃప్రాప్తి చేసుకోవడమంటే మాత్రం ఇంకా బారినే ఉంది.
Read Also: Bangalore : రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 31 మంది అరెస్ట్