Anna Hazare : కేజ్రీవాల్ అరెస్ట్ ఫై అన్నాహజారే కామెంట్స్
కేజ్రీవాల్ తప్పు చేసారు కాబట్టే అరెస్ట్ చేసారని..చట్టం ముందు అందరు సమానమే
- Author : Sudheer
Date : 22-03-2024 - 8:31 IST
Published By : Hashtagu Telugu Desk
లిక్కర్ స్కామ్ కేసు ((Delhi Liquor Scam) )లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal) ను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ ను బీజేపీయేతర పార్టీలు ఖండిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare).. కేజ్రీవాల్ అరెస్ట్ ఫై నోరు విప్పారు. కేజ్రీవాల్ తప్పు చేసారు కాబట్టే అరెస్ట్ చేసారని..చట్టం ముందు అందరు సమానమే అని..తప్పు చేసినవారికి శిక్ష పడాల్సిందే అని ఆయన చెప్పుకొచ్చారు. ఆనాడు లిక్కర్ కు వ్యతిరేకంగా నాతో కలిసి పనిచేసారు..కానీ తన అవసరాల కోసం లిక్కర్ పాలసీలు తీసుకొచ్చారని..అలాంటి వ్యక్తి తో పనిచేసినందుకు సిగ్గు పడుతున్నానని అన్నాహజారే తెలిపారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ కావడం నాకు ఏమాత్రం బాధ అనిపించడం లేదన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. అరవింద్ కేజ్రీవాల్, ఈడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు.. కేజ్రీవాల్‌ను 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. కాగా, లిక్కర్ స్కాం కేసులో గత రాత్రి ఈడీ తనను అరెస్టు చేసిన కేసులో బెయిల్ కోరుతూ.. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు నుంచి ఆయన ఉపసంహరించుకున్నారు. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు ఢిల్లీ సీఎం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే, ఇదే కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
Read Also : Vasthu Tips: స్త్రీలు తెలియక ఇంట్లో ఇలాంటి పనులు చేస్తున్నారా.. దరిద్రమే!