Internet: ఇంటర్నెట్ లో కిమ్ గురించి వెతికి ప్రాణాలు విడిచిన గూఢచారి.. అసలేం జరిగిందంటే?
నియంత అన్న పదానికి పెట్టంది పేరు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఆయన అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రపంచానికి తెలుసు. ముఖ్యంగా ఆ దేశ ప్రజలు ఆయన పాలనలో నరకాన్ని అనుభవిస్తున్నారు.
- By Nakshatra Published Date - 10:12 PM, Tue - 14 March 23

Internet: నియంత అన్న పదానికి పెట్టంది పేరు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఆయన అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రపంచానికి తెలుసు. ముఖ్యంగా ఆ దేశ ప్రజలు ఆయన పాలనలో నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎన్నో వింత, అనూహ్య ఘటనలకు నెలవు. ప్రజల కార్యకలాపాలపై నిఘా పెట్టమని ఓ గూఢచారికి బాధ్యతలు అప్పగిస్తే.. ఇంటర్నెట్లో కిమ్ గురించి వెతికి ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్తర కొరియాలో ప్రజలకు ప్రపంచంతో సంబంధాలు ఉండవు. బయటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిన వారిపై కిమ్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది. ఈ క్రమంలో ప్రజల కమ్యూనికేషన్ వ్యవహారాలు చూస్తోన్న బ్యూరో 10లో పనిచేస్తోన్న గూఢచారికి తన బాధ్యతల దృష్ట్యా ఇంటర్నెట్ ను యాక్సెస్ చేసుకోవడానికి అనుమతి లభించింది. దాంతో కిమ్ గురించి వెతికే ధైర్యం చేశాడు. మరి కొందరు ఈ విషయంలో ఉన్నతాధికారుల సూచనలకు విరుద్ధంగా ప్రవర్తించారు.
అయితే వారిని విధుల నుంచి బహిష్కరించగా.. ఈ గూఢచారికి మరణ శిక్షపడింది. నియంత గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. తన దేశంలో బయటి ప్రపంచంలోని విషయాలు తెలుసుకొని చైతన్యం పొందుతారేమోనని, దాని వల్ల తన కుటుంబ పాలనకు ఆటంకం కలుగుతుందేమోనని కిమ్ అనుక్షణం భయపడుతుంటాడు. అందుకే హాలీవుడ్ సినిమాలు చూసినా ఊరుకోడు. తన ప్రత్యర్థి దేశాలకు చెందిన మ్యూజిక్, సిరీస్లను దేశంలోకి రానివ్వడు. వాటిని చూసి పిల్లలు దొరికితే.. ఆరు నెలల పాటు తల్లిదండ్రులను కార్మిక శిబిరాలకు తరలిస్తారు.

Related News

Jagan Dictatorship: డిక్టేటర్ షిప్ లో డొల్లతనం
వైసీపీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. అలా ఇలా కాదు భారీ షాకులే వచ్చి పడుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏ ముహూర్తాన అన్నారో కానీ వైసీపీ పని అయిపోయింది