Amrit Bharat Express: నేడు ప్రధాని చేతుల మీదుగా అమృత్ భారత్ రైలు ప్రారంభం.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే..!
ఇండియన్ రైల్వేస్ నూతనంగా ప్రవేశపెడుతున్న ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’ (Amrit Bharat Express) రైలు నేటి నుంచి సేవలు కొనసాగించనుంది.
- By Gopichand Published Date - 07:08 AM, Sat - 30 December 23

Amrit Bharat Express: ఇండియన్ రైల్వేస్ నూతనంగా ప్రవేశపెడుతున్న ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’ (Amrit Bharat Express) రైలు నేటి నుంచి సేవలు కొనసాగించనుంది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్టా – కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య నడిచే ఈ రైలును ప్రధాని మోదీ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. కాగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అమృత్ భారత్ రైలు వలస కార్మికులకు మరింత ప్రయోజనకారిగా ఉండనుంది. ఇందులో 12 స్లీపర్ తరగతి, 8 జనరల్, 2 గార్డు బోగీలు ఉంటాయి.
డిసెంబరు 30న వందేభారత్ రైళ్లు, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారని, అందులో ఒకటైన మాల్దా టౌన్-ఎస్‌ఎంవీటీ బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నట్లు విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ. పాటిల్ తెలిపారు. ఈ ట్రైన్ విజయవాడ పరిధిలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు సహా 10 స్టేషన్లలో రైలు ఆగుతుంది.
Also Read: Cricketer Lamichhane: అత్యాచారం కేసులో దోషిగా క్రికెటర్
పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలోని సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లలో కొత్త కేటగిరీ అని, 22 కోచ్‌లతో కూడిన ఎల్‌హెచ్‌బి పుష్-పుల్ రైలును కలిగి ఉందని వివరించారు. వీటిలో 12 నాన్-ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ క్లాస్ (SL), 8 జనరల్ అన్‌రిజర్వ్డ్ క్లాస్ (GS/UR) కోచ్ లు ఉంటాయని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
అదనంగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మెరుగైన మరుగుదొడ్డి సౌకర్యాలు, ఆటోమేటిక్ పరిశుభ్రత వాసన నియంత్రణ వ్యవస్థ, ఎలక్ట్రికల్ క్యూబికల్‌లో ఏరోసోల్ ఆధారిత అగ్నిమాపక వ్యవస్థ, రేడియం ఇల్యూమినేషన్ ఫ్లోరింగ్ స్ట్రిప్, సాఫీగా ప్రయాణించడానికి జెర్క్-ఫ్రీ కప్లర్, కదలడానికి విశాలమైన గ్యాంగ్‌వేలను అందిస్తుంది. వందేభారత్ తరహాలో మరింత డైనమిక్‌గా దీనిని డిజైన్ చేశారు. దివ్యాంగ ప్రయాణికులకు, మహిళలకు అధునాతన సౌకర్యాలు కల్పించారు.