HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Amit Shah Press Meet At Hyderabad

Amit Shah : మేం రాగానే.. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం

మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు.

  • Author : Kavya Krishna Date : 11-05-2024 - 5:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah (1)
Amit Shah (1)

మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ… గతంలో బీఆర్‌ఎస్‌ అప్పులు చేసినట్లే కాంగ్రెస్‌ కూడా చేస్తోందని ఆరోపించారు. ఈ పదేళ్లలో తెలంగాణకు లక్షల కోట్ల నిధులు ఇచ్చామని అమిత్‌ షా అన్నారు. ఓవైపు ఇండి కూటమి.. రెండోవైపు ఎన్డీయే కూటమి అని, ఓవైపు 12 లక్షల కోట్ల అవినీతికి కూటమి.. మరోవైపు 25 పైసల అవినీతి కూడా లేని మోదీ కూటమి అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార అహంకారం తలకెక్కిన ఇండికూటమి.. 23 ఏళ్లుగా.. సెలవు లేకుండా దీపావళిని కూడా సైనికుల మధ్య జరుపుకునే మోదీ కూటమి అని ఆయన అన్నారు. ఈ పదేళ్లలో మేం దేశ అంతర్గత భద్రత, ఆర్ధిక వ్యవస్థ, మౌలికవసతుల అభివృద్ధి, డిజిటల్ ఇండియా, స్టార్టప్ వంటివాటిలో గణనీయమైన ప్రగతిని సాధించామని, 20సార్లు లాంచ్ చేసినా.. రాహుల్ లాంచింగ్ ను కాంగ్రెస్ విజయవంతంగా చేపట్టలేకపోతోందని అమిత్‌షా అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

21వసారి కూడా అదే విఫలప్రయత్నం దిశగా వారు పనిచేస్తున్నారని అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. 2014లో తెలంగాణలో రెవెన్యూ సర్ ప్లస్ ఉన్నదని, కానీ ఈ పదేళ్లలో రాష్ట్రప్రభుత్వాల తీరుతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రూ.15వేల కోట్లు లభిస్తే.. ఇవాళ ఒక్క తెలంగాణకే రూ.60వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. మౌలికవసతులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులకోసం.. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి 2014 వరకు వచ్చిన నిధులకంటే.. ఈ పదేళ్లలో రెట్టింపు నిధులు మోదీ గారు ఇచ్చారని, అవినీతి, అక్రమాలు, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలు భ్రష్టుపట్టాయని అమిత్‌ షా మండిపడ్డారు.

ఈ పరిస్థితి అర్థం చేసుకున్న ప్రజలు ఈసారి వీలైనన్ని ఎక్కువసీట్లలో బీజేపీకి విజయాన్ని కట్టబెట్టనున్నాయని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా.. నడిపేది మజ్లిస్ పార్టీయే అని ఆయన అన్నారు. తెలంగాణల్ 4శాతం ముస్లిం రిజర్వేషన్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయడమేనని, మేం రాగానే.. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్‌ షా అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలులో విఫలమైందని, 2 లక్షల రుణమాఫీని సోనియా జన్మదినం రోజు చేస్తామన్నారని, సోనియా ఎన్నవ పుట్టినరోజు అనేది చెప్పలేదన్నారు అమిత్‌ షా. రైతులకు రూ.15వేల రైతు భరోసా అన్నారు. అది కూడా చేయలేదని, క్వింటాలుపై ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తా అన్నారు ఇవ్వలేదన్నారు అమిత్‌ షా. మహిళలకు రూ.2500 ఇస్తామన్నారు అది కూడా చేయలేదని, ఇవేవీ చేయలేదు.. కానీ.. హైకమాండ్ కు ఇచ్చిన ఒక్క హామీని మాత్రం పూర్తిచేస్తున్నారన్నారు అమిత్‌ షా. దేశవ్యాప్తంగా ఎన్నికలకోసం తెలంగాణ నుంచి వసూలు చేసి పంపిస్తున్నారని, కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్, కూటమి నాయకుడు ఫారూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశసమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.
Read Also : Viral News : టీడీపీ క్యాడర్‌కు అతిపెద్ద మోటివేషన్‌..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • Lok Sabha Elections 2024
  • narendra modi

Related News

PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

PM Modi : ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రధాని సోషల్ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. చంద్రబాబును మంచి మిత్రుడని, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసు

  • President Donald Trump congratulated Taranjit Singh Sandhu on becoming the new Lieutenant Governor of Delhi

    Donald Trump: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

Latest News

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

  • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd