Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄India News
  • ⁄Amid Agnipath Protest Rajnath Singh Holds Meeting With Service Chiefs

Rajnath Singh: అగ్నిప‌థ్ పై కేంద్రం అత్య‌వ‌స‌ర స‌మీక్ష‌

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమీక్ష చేపట్టారు.

  • By CS Rao Updated On - 05:43 PM, Sat - 18 June 22
Rajnath Singh: అగ్నిప‌థ్ పై కేంద్రం అత్య‌వ‌స‌ర స‌మీక్ష‌

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమీక్ష చేపట్టారు. ఢిల్లీలో రాజ్ నాథ్ నివాసంలో నిర్వహించిన ఈ సమీక్షకు, ఆర్మీ నుంచి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బీఎస్ రాజు, ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి హాజరయ్యారు. అగ్నిపథ్ ప్రకటించిన అనంతరం దేశంలో జ‌రిగిన నిరసనలు, హింసాత్మక ఘటనలపై చ‌ర్చించారు. దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై స‌మీక్షించారు.

త్రివిధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాలిక నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ విధానం తీవ్ర నిరసన జ్వాలలకు కారణం అయింది. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడుతున్న సంఘటనలు పలుచోట్ల చోటుచేసుకున్నాయి. సికింద్రాబాద్ లో జరిగిన హింసాత్మక ఘటనలు అగ్నిపథ్ పై వ్యతిరేకతకు పరాకాష్ఠగా నిలిచాయి. కానీ, కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ విధానంపై త్రివిధ దళాలు సంతృప్తికరంగానే ఉన్నాయి. యువతకు అగ్నిపథ్ ఓ సువర్ణావకాశమని, అయితే ఈ పథకం గురించి సరైన అవగాహన లేనందునే నిరసనలు వ్యక్తమవుతున్నాయని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అభిప్రాయపడ్డారు. నేవీ చీఫ్ ఆర్.హరి స్పందిస్తూ, అగ్నిపథ్ పై ఈస్థాయిలో వ్యతిరేకత ఊహించలేదని అన్నారు. భారత సైన్యంలో అతిపెద్ద మానవ వనరుల నియామక ప్రక్రియ అగ్నిప‌థ్ అంటూ అభివర్ణించారు.

ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి కూడా ఈ విధానంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ పద్ధతిని వద్దంటున్నవారు ముందుగా దీని విధివిధానాలు తెలుసుకోవాలని సూచించారు. అగ్నిపథ్ గురించి పూర్తి సమాచారం పొందాలని, ఈ విధానాన్ని అర్థం చేసుకోవ‌డానికి ప్రయత్నించాలని అన్నారు.

Tags  

  • agnipath scheme
  • central cabinet
  • meeting
  • Rajnath singh

Related News

Agnipath Scheme : అగ్నిప‌థ్ పై  `ప‌ర‌మ‌వీర చ‌క్ర` ట్వీట్ దుమారం

Agnipath Scheme : అగ్నిప‌థ్ పై `ప‌ర‌మ‌వీర చ‌క్ర` ట్వీట్ దుమారం

పరమవీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ బానా సింగ్ చేసిన ట్వీట్‌ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యూహాత్మ‌కంగా ప్ర‌ధాని మోడీపై ఎక్కుపెట్టారు

  • karnataka: ఉత్తర కర్ణాటక ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రమే!

    karnataka: ఉత్తర కర్ణాటక ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రమే!

  • Agnipath : “అగ్నిపథ్” ఆలోచనకు అంకురార్పణ ఎక్కడ పడిందంటే..

    Agnipath : “అగ్నిపథ్” ఆలోచనకు అంకురార్పణ ఎక్కడ పడిందంటే..

  • PM Modi: మోడీ సభకు 10 లక్షల మంది హాజరు!

    PM Modi: మోడీ సభకు 10 లక్షల మంది హాజరు!

  • Rajnath Singh: అగ్నిపథ్ స్కీమ్‌పై సర్వీస్ చీఫ్‌లతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశం!

    Rajnath Singh: అగ్నిపథ్ స్కీమ్‌పై సర్వీస్ చీఫ్‌లతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశం!

Latest News

  • Coconut: దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అర్థం ఏంటి.. దేనికి సంకేతం!

  • Kidney Stones: కిడ్నీలో రాళ్లను న్యాచురల్ గా నివారించేందుకు బెస్ట్ టిప్స్ ఇవే!

  • Vastu Tips : విష్ణుప్రియ అపరాజితను ఈ దిక్కున పెట్టండి…ఇంట్లోకి ఐశ్వర్యం తెస్తుంది..!!

  • Reduce Pain: మందు లేకుండానే నొప్పిని తగ్గించే పనికరం.. ఈ వివరాలు తెలుసుకోండి!

  • Vastu tips : భోజనం చేసేటప్పుడు ఏవైపు కూర్చుంటే మంచిదో తెలుసా..:?

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: