Ram Leela : అయోధ్యలో ‘రామ్‌లీలా’ సందడి.. అన్ని పాత్రల్లోనూ మహిళా కళాకారులే
Ram Leela : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కానుంది.
- Author : Pasha
Date : 03-01-2024 - 2:05 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Leela : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. యావత్ దేశం నుంచి వచ్చే కళాకారులు మకర సంక్రాంతి (జనవరి 15) నుంచి జనవరి 22 వరకు అయోధ్యలోని వివిధ సాంస్కృతిక కేంద్రాల్లో రామ్‌లీలా నాటకాలను ప్రదర్శించనున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, కర్నాటక, సిక్కిం, కేరళ, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, చండీగఢ్‌కు చెందిన రామ్‌లీలా బృందాలు అయోధ్యలోని తులసీ భవన్ మెమోరియల్ వేదికగా ఈ కళా ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. అయితే ఇప్పటికే ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక కళా బృందం అయోధ్యలో రామ్‌లీలా(Ram Leela) ప్రదర్శన ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ కల్చరల్ టీమ్ వెరీవెరీ స్పెషల్.. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join.
- ఉత్తరాఖండ్‌కు చెందిన 50 మంది మహిళలతో కూడిన కళా బృందం అయోధ్యలోని తులసీ భవన్ మెమోరియల్‌లో రామ్ లీలా నాటకాన్ని ప్రదర్శించి అందరి మన్ననలు అందుకుంటోంది.
- ఈ కళా బృందం ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో అందరూ మహిళలే ఉన్నారు.
- పురుషుల పాత్రలను కూడా ఈ ట్రూపులోని మహిళలే పోషిస్తారు. పురుషుల పాత్రలకు అనుగుణంగా చక్కటి వేషధారణ చేసుకుంటారు.
- రాబోయే 11 రోజుల పాటు అయోధ్యలోని తులసీ భవన్ మెమోరియల్‌లో వీరి టీమ్ రామ్ లీలాను ప్రదర్శించనుంది.
- విశ్వహిందూ పరిషత్ సహకారంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అనుమతితో తమ టీమ్ రామ్‌లీలాను ప్రదర్శిస్తోందని ఉత్తరాఖండ్ మహిళల రామ్‌లీలా టీమ్ సారథి వెల్లడించారు.
Also Read: Israel Vs Lebanon : లెబనాన్ రాజధానిపై ఇజ్రాయెల్ ఎటాక్.. హమాస్ కీలక నేత హతం
ఉత్తరాఖండ్ మహిళల రామ్‌లీలా టీమ్ సారథి మాట్లాడుతూ..‘‘గతంలో మేం ఢిల్లీలోనూ రామ్ లీలాను ప్రదర్శించాం. మేం ఉత్తరాఖండ్‌లోని వివిధ జిల్లాలకు చెందినవాళ్లం. మొత్తం రామ్ లీలాను పూర్తిగా మహిళా కళాకారుల బృందంతో ప్రదర్శించడమే మా ప్రత్యేకత. రాముడు, రావణుడు ఏ పాత్ర అయినా మా టీమ్‌లోని మహిళలే పోషిస్తారు. మా బృందంలోని కొందరు మహిళలు వ్యవసాయ పనులు చేస్తుంటారు. ఆ పనులు ఆపేసి రామ్ లీలాలో పాల్గొనడానికి ఇప్పుడు అయోధ్యకు వచ్చారు’’ అని వివరించారు.