Vice Presidential Election : సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవడం మనందరి బాధ్యత – సీఎం రేవంత్ పిలుపు
Vice Presidential Election : తెలుగువాడిని గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి(Justice Sudarshan Reddy)ని ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నుకోవడంలో రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఒక తాటిపైకి రావాలని కోరారు
- By Sudheer Published Date - 06:36 PM, Wed - 20 August 25

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల (Vice Presidential Election) సందర్భంలో కీలక పిలుపునిచ్చారు. తెలుగువాడిని గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి(Justice Sudarshan Reddy)ని ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నుకోవడంలో రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఒక తాటిపైకి రావాలని కోరారు. పార్టీల భేదాభిప్రాయాలను పక్కన పెట్టి, తెలుగు ప్రతినిధిత్వానికి అవకాశం కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
Sciatica : సయాటిక నొప్పి వేధిస్తుందా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు రిలీఫ్ దొరుకుతుంది
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. గతంలో ఎన్టీఆర్ చూపిన చొరవను గుర్తు చేశారు. పీవీ నరసింహారావు విషయమై అప్పట్లో ఎన్టీఆర్ ప్రదర్శించిన కృషి, సంకల్పమే దేశ రాజకీయాల్లో తెలుగు ప్రజలకు గౌరవాన్ని తెచ్చిందని అన్నారు. అదే విధంగా ఈ సారి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే, ప్రజాస్వామ్యాన్ని బలపరిచినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల నుంచి 60 ఓట్లు సుదర్శన్ రెడ్డి గారికే పడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాజకీయ పార్టీలు వేర్వేరు అయినప్పటికీ, తెలుగు ప్రతిష్ట కోసం, ప్రజాస్వామ్యం కోసం ఒకే దిశగా ఓటు వేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో ప్రాంతీయత, భాషా గౌరవం ప్రాధాన్యం వహించాలని ఆయన అభిలషించారు.
సుదర్శన్ రెడ్డి గెలుపు కేవలం ఒక వ్యక్తి విజయమే కాకుండా, తెలుగు ప్రజల గౌరవానికి, దేశ ప్రజాస్వామ్యానికి ఒక బలమైన పునాది అవుతుందని సీఎం పేర్కొన్నారు. “సుదర్శన్ రెడ్డి గెలిస్తే ప్రజాస్వామ్యం సురక్షితం” అని చెప్పిన రేవంత్ రెడ్డి, ఉపరాష్ట్రపతి పదవిలో తెలుగు వాడి ప్రతినిధిత్వం రావడం రెండు రాష్ట్రాలకూ ఒక చారిత్రాత్మక ఘనత అవుతుందని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిగా ఎంపికయ్యారు. సెప్టెంబర్ 9న ఈ ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థిగా సి.పి. రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మరి రేవంత్ పిలుపు మేరకు సుదర్శన్ కు ఓట్లు వేస్తారో చూడాలి.