నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు
ఈ అంత్యక్రియల కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా తరలివచ్చి పవార్ నివాళులర్పించనున్నారు. వీరితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా ఈ అంతిమ సంస్కారాల్లో పాల్గొననున్నారు
- Author : Sudheer
Date : 29-01-2026 - 8:01 IST
Published By : Hashtagu Telugu Desk
Ajit Pawar Funeral : మహారాష్ట్ర రాజకీయాల్లో ధ్రువతారగా వెలిగిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అజిత్ పవార్ నిన్న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించడం రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన సమయంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఐదుగురిని బలితీసుకున్న ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టిన అజిత్ పవార్, ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం మహారాష్ట్ర రాజకీయాలకు పెద్ద లోటుగా పరిణమించింది.
ఆయన సొంత నియోజకవర్గమైన బారామతిలో నేడు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. స్థానిక విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. పవార్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచడంతో, తమ ప్రియతమ నేతను చివరిసారి చూసుకునేందుకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు బారామతికి తరలివస్తున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Shocking Truths About Ajit
ఈ అంత్యక్రియల కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా తరలివచ్చి పవార్ నివాళులర్పించనున్నారు. వీరితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా ఈ అంతిమ సంస్కారాల్లో పాల్గొననున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్ర మంత్రుల రాకతో బారామతి పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.