Air India : మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
Air India : మరోసారి ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యతో సతమతమైంది. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-2455) గాల్లో ఉండగానే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తాయి.
- By Kavya Krishna Published Date - 09:31 AM, Mon - 11 August 25

Air India : మరోసారి ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యతో సతమతమైంది. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-2455) గాల్లో ఉండగానే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తాయి. పరిస్థితిని గుర్తించిన పైలట్ అత్యవసర చర్యగా విమానాన్ని చెన్నై వైపు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ నిర్వహించారు. సమాచారం ప్రకారం, ఈ విమానం రాత్రి 8 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి, దాదాపు రెండు గంటలకు పైగా గాల్లో తిరుగుతూ చివరికి రాత్రి 10.35 గంటలకు చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. విమానంలో ప్రయాణికులతో పాటు ఐదుగురు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, కోడిక్కున్నిల్ సురేష్, అదూర్ ప్రకాష్, కే రాధాకృష్ణన్, రాబర్ట్ బ్రూస్ ఉన్నారు.
Refrigerator : రిఫ్రిజిరేటర్ వినియోగదారులకు ముఖ్య గమనిక.. ముందు ఈ డేట్ చెక్ చేశారా లేదా?
ఈ సంఘటనపై కేసీ వేణుగోపాల్ ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో స్పందిస్తూ, “భయంకరమైన ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నాం. పైలట్ సమయోచిత నిర్ణయం, నైపుణ్యం, అదృష్టం — ఈ మూడూ మమ్మల్ని కాపాడాయి. క్లియరెన్స్ కోసం దాదాపు రెండు గంటలు గాల్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్‌వేపై మరొక విమానం ఉండటంతో విరమించుకోవాల్సి వచ్చింది. రెండో ప్రయత్నంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాం. ప్రతి ప్రయాణికుడికి అదృష్టం ఎల్లప్పుడూ తోడవదు. ఈ ఘటనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తక్షణ దర్యాప్తు జరపాలి” అని పేర్కొన్నారు.
అయితే, చెన్నై విమానాశ్రయంలో మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్‌వేపై మరో విమానం ఉందన్న వేణుగోపాల్ వాదనను ఎయిర్ ఇండియా ఖండించింది. సాంకేతిక సమస్యలు, వాతావరణ పరిస్థితుల కారణంగానే విమానాన్ని చెన్నైకి మళ్లించామని, ఇది పూర్తిగా ముందు జాగ్రత్త చర్య అని స్పష్టం చేసింది. మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ “గో-అరౌండ్” ఆదేశించిందని, రన్‌వే ఆక్యుపెన్సీతో దీంట్లో సంబంధం లేదని ఎయిర్ ఇండియా తెలిపింది.
AP News : “బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా?”.. టీడీపీ వినూత్న ప్రచారం..